ఆ స్టార్ హీరో తండ్రి ఫిట్‌నెస్‌ చూస్తే షాకే.. వ‌య‌సు 82 ఏళ్లు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Sep 2020 8:27 AM GMT
ఆ స్టార్ హీరో తండ్రి ఫిట్‌నెస్‌ చూస్తే షాకే.. వ‌య‌సు 82 ఏళ్లు

పందెంకోడి సినిమాతో తెలుగు సినీ అభిమానుల‌కు ప‌రిచ‌య‌మైన విశాల్.. త‌న‌ పిట్‌నెస్ ఎంత బాగా మెయింటెన్ చేస్తారో తెలిసిందే. కండ‌లు తిరిగే దేహంతో ఔరా అనిపించేలా ఉంటాడు హీరో విశాల్‌. అయితే.. ప్ర‌స్తుతం హీరోగా రాణిస్తున్న విశాల్ పిట్‌నెస్ మెయింటెయిన్ చేయ‌డం ఓకే.. హీరో విశాల్‌ తండ్రి జీకే రెడ్డి తెలుసు క‌దా..!

Vk

82 ఏళ్ల వయసులో తాను ఆరోగ్యంగా ఉన్నానని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడమే తన ఆరోగ్యానికి కారణమని విశాల్‌ తండ్రి జీకే రెడ్డి చెబుతున్నారు. ఈ విష‌య‌మై ఆయ‌న త‌న‌ వ్యాయామానికి సంబంధించి వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఈ వీడియో చూసిన‌ అభిమానులు, నెటిజన్లు జీకే రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. జీకే గ్రానైట్స్‌ కంపెనీ అధినేత అయిన విశాల్ తండ్రి.. జీకే ఫిట్‌ అనే సంస్థను స్థాపించారు. దానిద్వారా వ్యాయామంలో మెళకువలు నేర్పిస్తుంటారు.

82 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‌గా ఉన్నారు. పిట్‌నెస్ విష‌యంలో మీ కృషి అభినందనీయం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలావుంటే.. ఇటీవ‌ల‌ కరోనా బారినపడిన జీకే రెడ్డి.. మ‌హ‌మ్మారిపై విజ‌యం సాధించారు. తండ్రికి కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో విశాల్‌ దగ్గరుండి చూసుకున్నాడు. ఆ క్రమంలోనే విశాల్ కూడా వైరస్‌ బారినపడ్డాడు. డాక్టర్ల సలహాలు, మనోధైర్యంతో ఇద్దరూ వైరస్‌పై విజయం సాధించారు.

Next Story