బిల్‌గేట్స్‌ ఇంట విషాదం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Sep 2020 9:01 AM GMT
బిల్‌గేట్స్‌ ఇంట విషాదం

మైక్రోసాప్ట్ అధినేత బిల్ గేట్స్‌ ఇంట విషాదం నెలకొంది. సోమవారం ఆయన తండ్రి విలియం హెన్రీ గేట్స్‌ కన్నుమూశారు. ఆయన వయసు 94 సంవత్సరాలు. ఈ విషయాన్ని బిల్‌ గేట్స్‌ వెల్లడించారు. కుటుంబ సభ్యుల మధ్యే ఆయన తుది శ్వాస విడిచారని చెప్పారు. తన తండ్రి మరణం ఎంతగానో బాదించిందన్నారు. "జీవితంలో తప్పకుండా జరగాల్సిన రోజు కోసం తామంతా మానసికంగా సిద్దమయ్యామని, తన తండ్రిని ఎంతగా మిస్ అవుతామో మాటల్లో చెప్పలేమని" గేట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే నా తండ్రి నిజమైన బిల్ గేట్స్ అని ట్వీట్‌ చేశారు.

గత కొంత కాలంగా విలియం గేట్స్‌ అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నారు. విలియమ్ గేట్స్ నవంబర్ 30, 1925న వాషింగ్టన్‌లోని బ్రెమెర్టన్‌లో జన్మించారు. వాషింగ్టన్‌ యూనివర్సిటీలో చదువుకున్నారు. అనంతరం కొద్ది కాలం ఆర్మీలో పని చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రైవేట్ ఫౌండేషన్ ది బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు.Next Story