న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

By సుభాష్  Published on  17 July 2020 10:17 AM GMT
న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

జూనియర్‌, డిగ్రీ కళాశాలల విద్యార్థులకు మధ్యాహ్నభోజన పథకం: కేసీఆర్‌

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, డిగ్రీ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఉదయం కళాశాలలకు వచ్చిన విద్యార్థులు మధ్యాహ్నానికి మళ్లీ వెళ్లిపోతున్నారని, దీని వల్ల ప్రభుత్వ కళాశాలల్లో డ్రాపవుట్స్‌ పెరిగిపోతున్నాయని అన్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం.. నిమ్మగడ్డకు కీలక సూచనలు

నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వంపై న్యాయస్థానం ఆగ్రహాం వ్యక్తం చేసింది. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ను కలిసి వినతి పత్రం సమర్పించాల్సిందిగా నిమ్మగడ్డను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని కోరాల్సిందిగా సూచించింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

దేశంలో 10లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 10లక్షలు దాటింది. దేశంలో లాక్‌డౌన్‌ సడలింపుల అనంతరం నిత్యం రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 34,956 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 687 మంది మృత్యువాత పడ్డారు. వీటితో కలిపి దేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 10,03,832కి చేరింది. 6,35,757 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

వెండితెరపై పెను సంచ‌ల‌నం.. కేజీఎఫ్.‌!

కేజీఎఫ్‌-సినీ ప‌రిశ్ర‌మే కాదు భార‌తీయ ప్రేక్ష‌కులంద‌రూ చ‌ర్చించుకునే ఓ సంచ‌ల‌న చిత్రం. బాహుబ‌లి త‌ర్వాత ఆ స్థాయిని అందుకోగ‌లిగిన అద్భుత చిత్రం ఇది. క‌న్న‌డ యువ‌న‌టుడు య‌ష్ హీరోగా న‌టించిన ఈ చిత్రం తెరకెక్కిన ఒక్క రోజులోనే ప్ర‌పంచ దృష్టిని ఆక‌ట్టుకుంది. అప్ప‌టి దాకా క‌న్న‌డ హీరోగా ప్రాంతీయ ముసుగులో ఉన్న య‌ష్ పండిట్ ఒక్క‌సారిగా పాన్ ఇండియా హీరో అయిపోయాడు. నిర్మాత‌ల అంచ‌నాల‌కు అంద‌నంత అనూహ్య విజ‌యాన్ని కేజీఎఫ్ సొంతం చేసుకుంది. తెలుగు,త‌మిళంలో ఈ సినిమా డ‌బ్ చేసి విడుద‌ల చేస్తే అక్క‌డా ఇంతే సంచ‌ల‌నం. ఇప్పుడు తాజాగా సీక్వెల్ గా కేజీఎఫ్-2 చిత్రం నిర్మిత‌మ‌యింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

జూలై 20 నుంచి తెరుచుకోనున్న సినిమా థియేటర్లు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కొరలు చాస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి దాదాపు 200లకుపైగా దేశాలకు చాపకింద నీరులా వ్యాపించి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఎటు చూసినా కరోనా గురించే చర్చ. ఈ వైరస్‌ కారణంగా చాలా మంది బతుకులు బజారు పడ్డాయి. సామాన్యుడి నుంచి వ్యాపారం చేసుకునే వారి వరకు జీవన విధానం దారుణంగా మారిపోయింది. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా .. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఏపీలో 40వేలకు చేరుకున్న కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది. నిత్యం రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 40వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో 20,245 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 2602 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. వీటిలో రాష్ట్రానికి చెందిన వారు 2592 మంది కాగా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్‌కు ముందస్తు బెయిల్‌

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు ఊరట లభిచింది. ఈడే కేసులో ఆయనకు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. రవిప్రకాశ్‌, మరో ఇద్దరు కలిసి టీవీ9 మాతృ సంస్థ అసోసియేటెడ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ నుంచి 2018 సెప్టెంబర్‌ నుంచి 2019 మే వరకు రూ.18కోట్ల నిధులను అనుమతుల్లేకుండా విత్ డ్రా చేశారనే ఆరోపణలు ఉన్నాయి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

భయపెట్టేలా రాహుల్ తాజా హెచ్చరిక..!

కొందరికి అదృష్టం కలిసి వస్తుంది. మరికొందరిని ఎంత వదిలించుకుందామనుకున్నా దురదృష్టం వెంటాడుతుంది. కాంగ్రెస్ పార్టీ కీలకనేత రాహుల్ గాంధీ రెండో కోవలోకి వస్తారు. ఆయన ఎంత ప్రయత్నించినా.. తన ఇమేజ్ ను పెంచుకోవటంలో విఫలవుతున్నారు. పలు సందర్బాల్లో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు.. చేస్తున్న విశ్లేషణలు సరైన ఆదరణ లభించటం లేదు. దీనికి తోడు రాహుల్ చెప్పే మాటలకు అధికారపక్షం నుం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కర్నూలు కలెక్టరేట్ ఎదుట మహిళా హెడ్‌కానిస్టేబుల్ నిరసన

కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మహిళా పోలీస్ హెడ్ కానిస్టేబుల్ నిరసనకు దిగారు. ఆత్మకూరు సీఐ గుణశేఖర్ బాబు తనను వేధింపులకు గురిచేస్తు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన నుంచి తనకు ప్రాణహని ఉందని, ఉన్నతాధికారులు సీఐపై చర్యలు తీసుకోవాలని మహిళా కానిస్టేబుల్ డిమాండ్ చేశారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

భర్తను చెట్టుకు కట్టేసి భార్యపై గ్యాంగ్‌ రేప్‌

ఒక వైపు కరోనాతో అల్లాడుతుంటే.. మరో వైపు కామాంధులు రెచ్చిపోతున్నారు. దేశంలో అభం శుభం తెలియని చిన్నారులపై, మహిళలపై జరుగుతున్న దారుణాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా..వారి అగడాలు మరింత పెరిగిపోయాయి. తాజాగా భర్త ఎదుటే భార్యపై నలుగురు వ్యక్తులు గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారు. అనంతరం వారి వద్ద ఉన్నడబ్బులను సైతం దోచుకెళ్లారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Next Story