టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్‌కు ముందస్తు బెయిల్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 July 2020 8:17 AM GMT
టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్‌కు ముందస్తు బెయిల్‌

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు ఊరట లభిచింది. ఈడే కేసులో ఆయనకు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. రవిప్రకాశ్‌, మరో ఇద్దరు కలిసి టీవీ9 మాతృ సంస్థ అసోసియేటెడ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ నుంచి 2018 సెప్టెంబర్‌ నుంచి 2019 మే వరకు రూ.18కోట్ల నిధులను అనుమతుల్లేకుండా విత్ డ్రా చేశారనే ఆరోపణలు ఉన్నాయి.

వీరిపై ఆ సంస్థ ప్రతినిధులు గతంలో బంజారహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పిర్యాదు చేయగా.. వీరిపై కేసు నమోదైంది. దాని ఆధారంగా ఈడీ వర్గాలు ఎన్‌ఫోర్స్‌మెంట్ కేన్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్(ఈసీఐఆర్‌) నమోదు చేశాయి. దీంతో తనను అరెస్టు చేస్తారని బావించిన రవిప్రకాశ్‌ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. రూ.లక్ష చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని, ప్రతి శనివారం ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాలని షరతు విధించింది.

Next Story