నిజమే.. హైకోర్టు అడిగినట్లుగా హైదరాబాద్ కు అన్ని ఒంటెలు ఎలా వచ్చినట్లు?

By సుభాష్  Published on  17 July 2020 5:57 AM GMT
నిజమే.. హైకోర్టు అడిగినట్లుగా హైదరాబాద్ కు అన్ని ఒంటెలు ఎలా వచ్చినట్లు?

హైదరాబాద్ మహానగరం అంతకంతకూ విస్తరిస్తోంది. ఒకప్పుడు వందల కిలోమీటర్లలో ఉండే భాగ్యనగరి ఇప్పుడు మహానగరంగా మారటమే కాదు.. ఏకంగా ఆరు వేలకు పైనే కిలోమీటర్ల మేరకు నగరం విస్తరించింది. ఇలాంటివేళ.. ఎప్పుడు? ఎక్కడ? ఏ జరుగుతుందో ఒక పట్టాన అర్థం కాని పరిస్థితి. ఇదిలా ఉంటే.. ఆ మధ్యన అక్రమంగా ఒంటెల మాంసాన్ని విక్రయించిన వైనం తెలిసిందే. దీనిపై తాజాగా తెలంగాణ హైకోర్టులో విచారణ సాగింది.

ఎక్కడో ఎడారిలో ఉండాల్సిన 71 ఒంటెలు హైదరాబాద్ కు ఎలా వచ్చాయన్నది ప్రశ్న. వాస్తవానికి ఇలాంటి సందేహాలు కోర్టుల కంటే ముందే పోలీసులకు రావాల్సి ఉంది.కానీ.. తాజా ఎపిసోడ్ లో మాత్రం హైకోర్టు తాజాగా ప్రశ్నించింది. ఎడారి ప్రాంతమే లేని తెలంగాణలోకి 71 ఒంటెలు ఎలా వచ్చాయి? దానికి సహకరించిన వారెవరూ? అన్నదిప్పుడు ప్రశ్నలుగా మారాయి.

హైదరాబాద్ కు చెందిన శశికళ అనే మహిళ దాఖలు చేసిన ప్రజాప్రయోజన చట్టం కింద నమోదు చేయగా.. దీనిపై మరిన్ని వివరాల్ని కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. హైదరాబాద్ కు వచ్చిన ఒంటెలన్ని రాజస్థాన్ కు చెందినవిగా గుర్తించారు. పట్టుకున్న వాటిని తిరిగి ఆ రాష్ట్రానికి పంపేశారు. ఇదంతా ఒకే కానీ.. అసలు సరైన అనుమతులు లేకుండా ఇంతలా ఎలా చేశారన్నది ప్రశ్న. పర్వదినాల్లో ఒంటె మాంసాన్ని అమ్మేవారిపై జీహెచ్ఎంసీ కఠిన నిర్ణయాలు తప్పవన్న సంకేతాల్ని తీసుకొచ్చింది. ఇంతకూ హైకోర్టు అడిగే వరకూ హైదరాబాద్ పోలీసులు ఈ రాకెట్ ను ఎందుకు చేధించనట్లు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

Next Story