ఒక వైపు కరోనాతో అల్లాడుతుంటే.. మరో వైపు కామాంధులు రెచ్చిపోతున్నారు. దేశంలో అభం శుభం తెలియని చిన్నారులపై, మహిళలపై జరుగుతున్న దారుణాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా..వారి అగడాలు మరింత పెరిగిపోయాయి. తాజాగా భర్త ఎదుటే భార్యపై నలుగురు వ్యక్తులు గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారు. అనంతరం వారి వద్ద ఉన్నడబ్బులను సైతం దోచుకెళ్లారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. బిర్వానీ జిల్లాలో జూలై 14న జరిగిన ఈ ఘటనపై పోలీస్‌ సూపరింటెండెంట్‌ సునీతా రావత్‌ వివరాలు వెల్లడించారు. బైక్‌పై వెళ్తున్న దంపతులు.. కాలకృత్యం తీర్చుకునేందుకు భార్య  బైక్  దిగి అటవీ ప్రాంతంలోకి వెళ్లింది.

భార్య ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చిన భర్త.. అటవీ ప్రాంతంలోకి వెళ్లి చూడగా, అక్కడ కొంత మంది భార్యపై అఘాయిత్యానికి పాల్పడటం గమనించాడు. వెంటనే వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, అతన్ని చెట్టుకు కట్టేసి నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసినట్లు తెలిపారు. అలాగే వారి వద్దనున్న రూ.24వేలు దోచుకెళ్లారని తెలిపారు. దీంతో జూలై 15న వారు పోలీసులకు ఫిర్యాదు చేశారని, వారి ఫిర్యాదు మేరకు గురువారం ఖార్గోన్‌ రేంజ్‌ డిప్యూటీ ఇన్స్‌ పెక్టర్‌ జనరల్‌ తిలక్‌సింగ్‌, ఇండోర్‌ రేంజ్‌ ఇన్స్‌ పెక్టర్‌ జనరల్ వివేక్‌ శర్మలతో కలిసి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించినట్లు చెప్పారు. నిందితులపై త్వరలోనే పట్టుకుంటామని, వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.
antalya escort
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort