ఏడేళ్ల బాలికను చంపేసి శవాన్ని కాలువలో పడేశాడు.. ఇంతకూ ఆ బాలిక అడిగిందేమిటంటే..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 July 2020 2:32 PM GMT
ఏడేళ్ల బాలికను చంపేసి శవాన్ని కాలువలో పడేశాడు.. ఇంతకూ ఆ బాలిక అడిగిందేమిటంటే..?

ఏడేళ్ల బాలికను చంపినందుకు తమిళనాడు పోలీసులు ఓ వ్యక్తిని, అతడి స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇంతకూ ఆ బాలికను చంపడానికి కారణమేమిటో తెలుసా..? రిమోట్ అడగడమే..! ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం తూత్తుకుడి జిల్లాలో చోటుచేసుకుంది.

సతాంకుళమ్ టౌన్ కు చెందిన అమ్మాయి అప్పుడప్పుడు పొరుగింట్లో టీవీ చూడడానికి వెళుతూ ఉంటుంది. వారి ఇంట్లో కరెంట్ లేకపోవడంతో ఆమె టీవీ చూడడానికి వెళ్ళింది. ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి అప్పటికే తన తండ్రితో గొడవపడి కోపంలో ఉన్నాడు. ఇంతలో ఆ బాలిక టీవీ రిమోట్ ఇవ్వాలని.. ఛానల్ మార్చుకుంటానని సాధారణంగా అడిగింది. దీంతో ఆ వ్యక్తి పట్టరాని కోపంతో ఆ బాలిక గొంతు నులిమి చంపేశాడు. ఆ బాలిక శవాన్ని ప్లాస్టిక్ డ్రమ్ లో దాచేశాడు. తన స్నేహితుడి సహాయంతో ఆ బాలిక శవాన్ని దగ్గరలో ఉన్న కాలువ దగ్గర పాతేశాడు. ఆ బాలిక ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో కాలువ వుంది. ఆ బాలిక తల్లి రోజూ కూలీకి వెళ్ళేది.

'ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశాం. ఈ ఘటన ఉదయం 11:30- 12:00 మధ్య చోటుచేసుకుంది. మధ్యాహ్నం 2:30 సమయంలో బాలిక కనిపించకుండా పోయిన సమాచారం మాకు అందింది. కొన్ని గంటల్లోనే ఆమెను చంపిన వ్యక్తిని పట్టుకున్నాం. అమ్మాయిని చంపిన వ్యక్తికి ఉదయానే తన తండ్రితో గొడవ అయ్యింది. అందుకే ఈ దారుణానికి ఒడిగట్టాడు. నిందితుడు నేనే బాలికను చంపానని ఒప్పుకున్నాడు. బాలిక మృతదేహాన్ని తిరునల్వేలి గవర్నమెంట్ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం పంపించాం. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది' అని తూత్తుకుడి ఎస్పీ జయకుమార్ మీడియాకు తెలిపారు.

ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తి డ్రగ్స్ మత్తులో ఉన్నాడని.. మైనర్ బాలిక మీద లైంగికంగా కూడా దాడి చేసి ఉంటాడని స్థానికంగా ఆరోపణలు వచ్చాయి. పోలీసులు దీనిపైన కూడా విచారిస్తూ ఉన్నారు. పోస్కో యాక్ట్ కింద ఆ ఇద్దరిపై కేసు నమోదు చేశారు.

జులై నెలలోనే తమిళనాడు రాష్ట్రంలో ఏడేళ్ల మైనర్ బాలికను చంపేసిన ఘటన తీవ్ర విమర్శలకు దారి తీసింది. చనిపోయిన ఏడేళ్ల దళిత బాలిక ముఖం మీద తీవ్ర గాయాలు అయ్యాయి. తమిళనాడు లోని పుదుకోట్టై జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ బాలిక గ్రామ శివార్లలో అటవీ ప్రాంతానికి దగ్గరలో ఆ అమ్మాయి శవం పడి ఉండడాన్ని స్థానికులు చూశారు. బాలిక ఇంటి దగ్గర ఉన్న రవి అనే 25 సంవత్సరాల వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆ బాలికను రవి లైంగికంగా వేధించినట్లు సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు.

Next Story
Share it