ప్రేమించిన వాడు మోసం చేశాడని.. యువతి ఆత్మహత్య

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 July 2020 6:39 AM GMT
ప్రేమించిన వాడు మోసం చేశాడని.. యువతి ఆత్మహత్య

ఆ ఇద్దరు ఒకే సంస్థలో పనిచేస్తున్నారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇటీవల యువతి.. తనను పెళ్లి చేసుకోవాలని యువకుడిని కోరింది. పెళ్లికి ఆ యువకుడు నిరాకరించాడు. దీంతో మనస్థాపం చెందిన ఆ యువతి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్‌ గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బోలక్‌పూర్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట ప్రాంతానికి చెందిన పయ్యావుల రాములు కూతురు పి.కళ్యాణి (26) నగరంలోని ఓ న్యూస్‌ చానల్‌లో పనిచేస్తున్నది. అదే సంస్థలో శివ అనే యువకుడు పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. రెండు సంవత్సరాలు వీరి ప్రేమ కొనసాగింది. ఇటీవల కళ్యాణి.. తనను పెళ్లి చేసుకోవాలని శివను కోరింది. అందుకు శివ నిరాకరించాడు. దీంతో కళ్యాణి తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కళ్యాణి తన సోదరుడు సుమన్‌తో కలిసి బోలక్‌పూర్‌లో ఉంటున్నారు. ఓ బార్బర్‌ షాపులో పనిచేస్తున్న సోదరుడు ఉదయం షాప్ వెళ్లాడు.

రాత్రి వచ్చి చూసే సరిగా ఇంట్లో కళ్యాణి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story
Share it