కర్నూలు కలెక్టరేట్ ఎదుట మహిళా హెడ్‌కానిస్టేబుల్ నిరసన
By తోట వంశీ కుమార్ Published on 17 July 2020 9:57 AM GMT
కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మహిళా పోలీస్ హెడ్ కానిస్టేబుల్ నిరసనకు దిగారు. ఆత్మకూరు సీఐ గుణశేఖర్ బాబు తనను వేధింపులకు గురిచేస్తు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన నుంచి తనకు ప్రాణహని ఉందని, ఉన్నతాధికారులు సీఐపై చర్యలు తీసుకోవాలని మహిళా కానిస్టేబుల్ డిమాండ్ చేశారు.
భార్యకు విడాకులు ఇస్తున్నానంటూ నకిలీ పత్రాలు చూపించి ఒంటరిగా ఉన్న తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆరోపించారు. అవసరాలు ఉన్నాయని చెప్పి తన నుంచి రూ.70వేల నగదు తీసుకున్నాడని తెలిపింది. పెళ్లి చేసుకోవాలని కోరితే.. తనను చంపుతానని వేదింపులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. పూర్తి ఆధారాలతో ఎస్పీకి ఫిర్యాదు చేశానని, అయితే.. తనకు సీఐ నుంచి ప్రాణ హాని ఉందని.. సీఐపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేశారు.
Next Story