నేను గాంధీని కాదు..నన్ను కొడితే తిరిగి కొడతా..కవిత వార్నింగ్

ప్రజలకు వసతులు కల్పించడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ విఫలమయ్యాయి..అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు.

By -  Knakam Karthik
Published on : 12 Dec 2025 11:56 AM IST

Telangana, Hyderabad,  Kavitha, Brs, Congress, Harishrao, Cm Revanth

నేను గాంధీని కాదు..నన్ను కొడితే తిరిగి కొడతా..కవిత వార్నింగ్

హైదరాబాద్: ప్రజలకు వసతులు కల్పించడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ విఫలమయ్యాయి..అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల అక్రమాలు బయటకు వస్తున్నాయని అన్నారు. తన భర్తపై తప్పుడు ఆరోపణలు చేసిన వారికి లీగల్ నోటీసులు పంపిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఉద్యమ సమయంలో ఎవరూ ఏ స్టూడియోల దగ్గర ఎంత వసూలు చేశారో చిట్టా విప్పుతా. వారంలో తన భర్తకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కవిత డిమాండ్ చేశారు.

హరీశ్ రావు నాపై దుష్ప్రచారం చేస్తుంటే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మద్దతుగా మాట్లాడుతున్నారు. నా భర్త బాచుపల్లి లో ఏ ల్యాండ్ కొనుగోలు చేశారో అది 2019 లో అమ్మేశారు. 2022లో బిఆర్ఎస్ ప్రభుత్వం ఆ ల్యాండ్ కి అనుమతి మరి అది ప్రభుత్వ భూ అయితే ఎలా కేటీఆర్ అనుమతి ఇచ్చారు. దీనిలో 5 ఎకరాలకు ఎన్నికలకు ముందు రెండు రోజుల ముందు చేంజ్ ఆఫ్ ల్యాండ్ అనుమతి ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 ఎకరాల భూమి కి అనుమతి ఇచ్చింది . మాధవరం కృష్ణారావు పలు ప్రాంతాల్లో భూములను ఆక్రమించారు చెరువును సైతం ఆక్రమించారు. హైడ్రా వాటిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. మాధవరంపై దాడి చేసే ఉద్దేశం లేదు... ఆయన వెనుక గుంట నక్క ఉంది... ఆ గుంట నక్కను వదలను...అని కవిత అన్నారు.

నా భర్త ఫోన్ ట్యాప్ చేశారు... సొంత అల్లుడి ఫోన్ ట్యాప్ చేసిన దుర్మార్గులు. నా బంగారం తాకట్టు పెట్టీ ఉద్యమం చేశా. బిఆర్ఎస్ హయాంలో నేను ఏలాంటి బెనిఫిట్ పొందలేదు. నేను ఆరోపణలకు వెన్ను చూపాను. నాపై నా భర్తపై ఆరోపణలు చేసిన వారిని వదలను. కేసీఆర్ నీడన పంది కొక్కులు చేరి భూ దందా , హిల్ట్ పాలసీ కి తెర లేపింది బిఆర్ఎస్ ప్రభుత్వం... దాన్ని కాంగ్రెస్ కొనసాగిస్తుంది. బిఆర్ఎస్ లో చాలా తప్పులు జరిగాయి.. ఎంత పెద్ద నాయకుడైనా ప్రజలకు జవాబు చెప్పాలి. నేను గాంధీ తాతను కాను నన్ను కొడితే తిరిగి కొడతా...అని కవిత హెచ్చరించారు.

Next Story