ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన ప్రభాకర్ రావు

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 నిందితుడు మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు.

By Knakam Karthik
Published on : 9 Jun 2025 12:00 PM IST

Telangana, Hyderabad, Phone Tapping Case, Prabhakar Rao, Kcr, Brs, Congress

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన ప్రభాకర్ రావు

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 నిందితుడు మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. పంజాగుట్ట పీఎస్ లో నమోదైన కేసు విచారణలో భాగంగా ఆయన ఇవాళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఏ1 గా ఉన్న ప్రభాకర్ రావు 14 నెలల తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో అమెరికా నుంచి నిన్న హైదరాబాద్ కు చేరుకున్నారు.

ఇవాళ ఉదయం సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో నలుగురు అధికారులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్నలు అరెస్టయి దీర్ఘకాలం రిమాండ్ లో ఉన్నారు. అనంతరం బెయిల్ పై విడుదలయ్యారు. గతంలో విచారణ సమయంలో వీరిచ్చిన సమాచారం ఆధారంగా ప్రభాకర్ రావును సిట్ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story