ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఆ ఇద్దరికీ బెయిల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న మాజీ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) భుజంగరావు, మాజీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) రాధాకిషన్ రావులకు తెలంగాణ హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది.

By Knakam Karthik  Published on  30 Jan 2025 2:37 PM IST
Telangana, Phone Tapping, Brs, Congress, Ktr, Kcr, Harishrao, Cm Revanth

ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఆ ఇద్దరికీ బెయిల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న మాజీ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) భుజంగరావు, మాజీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) రాధాకిషన్ రావులకు తెలంగాణ హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల చొప్పున ఇద్దరు పూచీకత్తులు సమర్పించాలని, పాస్‌పోర్టులను సరెండర్ చేయాలని కోర్టు వారిని ఆదేశించింది. ఈ కేసులో విచారణ ప్రక్రియకు సహకరించాలని కోర్టు వారికి సూచించింది.

నాంపల్లి కోర్టు వీరి బెయిల్ పిటిషన్‌ను రెండు సార్లు తిరస్కరించింది. దీంతో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పదినెలలకు పైగా జైలులో ఉన్నామని, అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని ఇరువురు హైకోర్టును కోరారు. వారి ఆరోగ్య పరిస్థితిని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ఇద్దరికీ బెయిల్ మంజూరు చేసింది. ఈకేసులో ఇంకా విచారణ సాగుతోందని, ఎక్కడా కూడా సాక్షులను ప్రభావితం చేయవద్దని, దర్యాప్తు అధికారులను కూడా ప్రభావితం చేసేలా ప్రయత్నిస్తే చర్యలు తప్పవని తెలంగాణ హైకోర్టు తెలిపింది.

Next Story