హైదరాబాద్: కేసీఆర్‌ను రాష్ట్ర ప్రజలు ఎంత మిస్ అవుతున్నారు అనేది సోషల్ మీడియా చూస్తే తెలుస్తుంది..అని కేటీఆర్ అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడికక్కడ రియల్ ఎస్టేట్ స్తంభించిపోయింది. వాస్తవాలు చెప్తే ముఖ్యమంత్రికి ఇబ్బంది కలగవచ్చు. ప్రజలకు అర చేతిలో వైకుంఠం చూపారు. వీళ్ళు తులం బంగారం ఇచ్చే వాళ్లు కాదు పుస్తెల తాడు ఎత్తుకపోయే బ్యాచ్. వెనుకటి రోజులు మళ్లీ తెస్తా అని రేవంత్ రెడ్డి నిజాయితీగా చెప్పారు.అదే చేశారు..అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
రియల్ ఎస్టేట్ పడిపోవడానికి సన్నాసి ప్రభుత్వం కారణం. హైడ్రా పేరుతో గరీబోళ్ల ఇళ్ళు కూలుస్తారు పట్నం మహేందర్ రెడ్డి, కె.వి.పి, వివేక్, పొంగులేటి ఇళ్ళు కనపడటం లేదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు ఏ లింగమో వాళ్ళకే తెలియదు? అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్ గౌడ్ బిఆర్ఎస్ పార్టీ అయితే ప్రేమ్ గౌడ్ పార్టీలో చేరుతుంటే ఎందుకు రాలేదు. ప్రకాష్ గౌడ్ నాలుగు సార్లు గెలిస్తే ఏంటి...? 40 సార్లు గెలిస్తే ఏంటి...? బ్రతుకు అవసరమా..? పంది లెక్క వంద ఏళ్ళు బ్రతుకు ఎందుకు నంది అయ్యి నాలుగు ఏళ్ళు బ్రతికితే నయం.. రేవంత్ రెడ్డి రాజేంద్రనగర్‌కు ఏం చేశారు...?.ప్రకాష్ గౌడ్ ఏం ఆశించి కాంగ్రెస్ పార్టీలో చేరారు..అని కేటీఆర్ ప్రశ్నించారు.