రాహుల్‌గాంధీకి దమ్ముంటే అశోక్‌నగర్ రావాలి..కేటీఆర్ సవాల్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై కేటీఆర్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

By -  Knakam Karthik
Published on : 9 Jan 2026 2:13 PM IST

Telangana, Hyderabad, Ktr, Rahulgandi, Congress, Brs, Kcr, CM Revanth

రాహుల్‌గాంధీకి దమ్ముంటే అశోక్‌నగర్ రావాలి..కేటీఆర్ సవాల్

హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై కేటీఆర్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మైనార్టీలకు రక్షకుడిగా చెప్పుకునే రాహుల్ మౌలానా ఉర్దూ యూనివర్సిటీపై మాట్లాడాలని అన్నారు. మౌలానా ఉర్దూ వర్సిటీని కాపాడుకోవడానికి ప్రత్యేక పోరాటానికి దిగుతామని, ఉర్దూ వర్సిటీలో 50 ఎకరాలపై రేవంత్ సర్కార్ కన్నుపడిందని ఆరోపించారు. రెండున్నరేళ్లలో వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే, యూనివర్సిటీని అభివృద్ధి చేస్తామని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

మౌలానా వర్సిటీని కాపాడుకునేందుకు ఢిల్లీ వెళ్లి పోరాటం చేస్తాం. దేశంలో ఉన్న ఒకే ఒక్క ఉర్థూ‌ నేషనల్ యూనివర్శిటీ హైదరాబాద్ లో ఉంది. నేషనల్ యూనివర్సిటీని రేవంత్ సర్కార్ నిర్వీర్యం చేస్తుంది. హైదరాబాద్ అవసరాల కోసం గతంలో ఉర్థూ నేషనల్ అండగా ఉంది. రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో రేవంత్ చూపిస్తున్నాడు..అని కేటీఆర్ ఘాటుగా స్పందించారు. రాహుల్‌గాంధీకి దమ్ముంటే అశోక్ నగర్ రావాలి. రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ? ఎందుకు హామీ ఇచ్చారు..అని కేటీఆర్ ప్రశ్నించారు.

ఓఆర్‌ఆర్ కోసం గతంలో మౌలానా వర్సిటీ 32 ఎకరాలు ఇచ్చింది. లింక్ రోడ్ కోసం 7 ఎకరాలు ఇచ్చారు. తెలంగాణలో వర్సిటీ భూములను లాక్కోవడం సీరియల్ మాదిరి జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. జయశంకర్ వర్సిటీలో రేవంత్ సర్కార్ వంద ఎకరాలను తీసుకుందని కేటీఆర్ అన్నారు. సెంట్రల్ వర్సిటీలో 400 ఎకరాలపై కన్నేస్తే సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Next Story