తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీకి చేరుకున్న మాజీ సీఎం కేసీఆర్‌తో సీఎం రేవంత్ రెడ్డి కరచాలనం చేశారు. అయితే అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత కేవలం ఐదు నిమిషాలు మాత్రమే కేసీఆర్ శాసనసభలో ఉన్నారు. స్పీకర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత ఆయన అసెంబ్లీ నుంచి నందినగర్ నివాసానికి తిరిగి వెళ్లిపోయారు.
అసెంబ్లీ సమావేశ హాల్లో కేసీఆర్ వద్దకు మర్యాదపూర్వకంగా వచ్చి సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, అడ్డూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇతర మంత్రులు ప్రభుత్వ విప్ లు.. నూతనంగా గెలిచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కలిశారు.