జూబ్లీహిల్స్ గల్లీగల్లీ తిరుగుతా, ప్రచారం నిర్వహిస్తా: కేటీఆర్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్య కారణాలతో వచ్చింది..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

By -  Knakam Karthik
Published on : 15 Sept 2025 3:00 PM IST

Hyderabad News, Jubilee Hills Bypoll, Brs, Congress, Bjp, Ktr, CM Revanthreddy

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్య కారణాలతో వచ్చింది..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..అనివార్య కారణాలతో ఈ ఎన్నిక వచ్చింది. ఔటర్ లోపల జాతీయ పార్టీలకు అవకాశం లేదు. జిల్లాల్లో కాంగ్రెస్ మోసపూరిత హామీలను నమ్మి మోసపోయారు. కాంగ్రెస్ వాళ్ళే యూరియాని డైవర్ట్ చేస్తున్నారు బ్లాక్ లో అమ్ముకుంటున్నారు. అందుకే యూరియా కొరత ఏర్పడింది. మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గన్మెన్ ఒక లారీ లోడ్ యూరియా ఎత్తుకెళ్లాడు. గన్మెన్ లారీ లోడ్ తీసుకువెళ్తే ఎమ్మెల్యే ఒక గోదాం తీసుకువెళ్తాడు. కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నారు మహిళలు పుస్తెలు జాగ్రత్త. పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదు..అని కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు.

తొమ్మిదిన్నర ఏళ్లలో రూ. 20వేల కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాం. 13 లక్షల మంది విద్యార్థులకు ఈ ప్రభుత్వం శట గోపం పెడుతుంది. చిన్న దొంగలు., పెద్ద దొంగలు కలిసి రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికలు ముగిశాక ఒక్క కాంగ్రెస్ నేత మీ కంటికి కనపడరు. నియోజకవర్గంలో ఇప్పుడు తిరుగుతున్న ముగ్గురు మంత్రులు ఆ తర్వాత కనిపించరు. కేసీఆర్ హయాంలో పదేళ్లు నగరం సురక్షితంగా ఉంది. నగరంలో వరదలకు ముగ్గురు గల్లంతయ్యారు.

నగరంలో గుంతలు పూడ్చే సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదా. ఇలాంటి ముఖ్యమంత్రి ఎక్కడా చూడలేదు. గోపన్న లేకపోయినా మేమంతా మీకు అండగా ఉంటాం. టసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారు భయపడితే లీడర్ కాలేము. ఒక్కొక్క బూత్‌కు 800 నుంచి 1200 ఓట్లు ఉన్నాయి. 25 కుటుంబాలకు ఒక ఇంచార్జి పని చెయ్యాలి. కాంగ్రెస్ ఇచ్చిన పథకాలు అమలవుతున్నాయా లేదా అని వారిని అడిగి వివరాలను నమోదు చేసుకోవాలి. వెంగళరావునగర్లో పార్టీలో కొన్ని సమస్యలు ఉన్నాయి. పార్టీలో సమస్యలను లీడర్‌తో కలిసి పరిష్కరించుకోవాలి. పోయినసారి మెజార్టీ కన్నా ఈసారి ఎక్కువ మెజారిటీ రావాలి..అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Next Story