ఎంతోమంది ప్రయత్నించారు.. కానీ రేవంత్ చాలా ఈజీగా కేసీఆర్‌ను దించేశాడు : మోత్కుప‌ల్లి

రేవంత్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడడంతో ప్రజలు ఆనందంగా ఉన్నారని మాజీ మంత్రి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు అన్నారు.

By Medi Samrat  Published on  30 Jan 2024 3:53 PM IST
ఎంతోమంది ప్రయత్నించారు.. కానీ రేవంత్ చాలా ఈజీగా కేసీఆర్‌ను దించేశాడు : మోత్కుప‌ల్లి

రేవంత్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడడంతో ప్రజలు ఆనందంగా ఉన్నారని మాజీ మంత్రి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు అన్నారు. గాంధీభ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ నియంత పాలన అంతమొందించిన కాంగ్రెస్ పార్టీకి ప్రజల తరపున దన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ ని కొట్టడం కోసం ఎంతోమంది నాయకులు ప్రయత్నించారు. కానీ రేవంత్ చాలా ఈజీగా కేసీఆర్ ని దించేశాడని కొనియాడారు.

కేసీఆర్ సిగ్గు శరం వదిలి ప్రజలని దోచుకున్నారని విమ‌ర్శించారు. కేసీఆర్ బయటకి వచ్చే పరిస్థితి లేదన్నారు. కేటీఆర్ పిల్ల‌గాడిలాగా ఆడుకుంటున్నాడని.. కేటీఆర్ ప్రభుత్వాన్ని సొంత ఆస్తి లాగా వాడుకున్నాడని.. అత‌డి మాటలకు అంతు లేదని.. త్యాగాలు చేసి అలిసిపోయినట్లు మాట్లాడుతున్నారని విమ‌ర్శించారు.

అమరవీరుల రక్తం తాగి వేలాది కొట్లు సంపాదించుకున్నారని ఆరోపించారు. ఓడిపోయిన తెల్లారి నుండే బయటకి వచ్చి ఇష్టం వచ్చినట్టు కేటీఆర్ మాట్లాడుతున్నారని మండిప‌డ్డారు. నిజాంకి వ్యతిరేకంగా పోరాడి విముక్తి పొందినట్టు కేసీఆర్ కి వ్యతిరేకంగా పోరాడి విముక్తి పొందారని పేర్కొన్నారు. విలువల్లేని మనుషులు కేసీఆర్ కుటుంబ సభ్యులన్నారు.

రేవంత్ నాయకత్వాన్ని చూసి ఎమ్మేల్యేలు క్యూ కడుతున్నారని అన్నారు. కేటీఆర్ తల దించుకోవాలి.. కేటీఆర్ దగ్గర ఎవరూ మిగలరని అన్నారు. బీఆర్ఎస్ లో చాలా మంది డబ్బుల కోసమే బతుకుతారని ఆరోపించారు.

కేసీఆర్ కుటుంబం తెలంగాణ సెంటిమెంట్ ని వాడుకుంద‌న్నారు. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ రేవంత్ కాలి గోటికి కూడా సరిపోరన్నారు. బీఆర్ఎస్ మిగలదు గాక మిగలదు.. లోక్ సభ ఎన్నిక‌ల‌లో బీఆర్ఎస్ గెలవదన్నారు.

మగాళ్ళు అయితే ఏ స్థానంలో గెలుస్తారో కేటీఆర్ చెప్పాలని స‌వాల్ విసిరారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులపై విచారణ జరపాలని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. దళితబందులో 50% ఎమ్మేల్యేలే తిన్నారర‌న్నారు. వ్యాపారం కోసమే బీఆర్ఎస్ పార్టీ నడిచిందన్నారు.

రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోందన్నారు. ప్రజలను కలవని దొంగ కేసీఆర్ అని అన్నారు. 50 రోజుల రేవంత్ పాలన చూసి బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు క్యూ కడుతున్నారని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ మాటలు ఆపేయాలన్నారు. ఏ కారణం వల్ల ఓడిపోయారో చెప్పే దమ్ము దైర్యం కేసీఆర్, కేటీఆర్ లకి ఉందా? అని ప్ర‌శ్నించారు.

సోనియా ఇచ్చిన తెలంగాణని నేనే తెచ్చానని కేసీఆర్ డబ్బా కొట్టుకున్నాడని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ ఆస్తులపై విచారణ జరుగుతుంద‌న్నారు. కేసీఆర్, కేటీఆర్ తన ఆస్తులు ఎంతో చెప్పుకొగలరా? అని ప్ర‌శ్నించారు. కేసీఆర్ ఫోన్ చేసి.. అన్నా అని దళిత బందు పాలసీ గురించి చెపితే మెచ్చుకున్నా.. తన ఎమ్మెల్యేలే దళితబందు తింటున్నారని కేసీఆర్ ఒప్పుకున్నారని అన్నారు.

Next Story