తెలంగాణా మాది.. మీది కాదు : మాజీమంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి

కాంగ్రెస్‌తో బీజేపీ కుమ్మకై ఓడించారని.. ఎన్నికల ముందు కాళేశ్వరంపై నివేదిక విడుదల ఆ కుట్రలో భాగమేన‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి ఆరోపించారు.

By Medi Samrat  Published on  30 Jan 2024 10:38 AM GMT
తెలంగాణా మాది.. మీది కాదు : మాజీమంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి

కాంగ్రెస్‌తో బీజేపీ కుమ్మకై ఓడించారని.. ఎన్నికల ముందు కాళేశ్వరంపై నివేదిక విడుదల ఆ కుట్రలో భాగమేన‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి ఆరోపించారు. ఒకటి నుండి రెండు శాతం కాంగ్రెస్ కు లాభం జరిగేలా మోదీ చర్యలు ఉన్నాయ‌ని అన్నారు. తెలంగాణా ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారన్నారు. కేసులకు, దాడులకు గులాబీ శ్రేణులు భయపడరన్నారు. మేము తిరగ బడితే మీ పత్తా దొరకదని హెచ్చ‌రించారు. దాడులతో రెచ్చిపోతే మీ భరతం పడతామ‌న్నారు.

అధికార అహంకారాన్ని తెలంగాణా సమాజం ఉపేక్షించదన్నారు. నిజాం నవాబులనే తరిమిన గడ్డ ఇది.. అంతకంటే మీరు గొప్పుళ్ళు కారన్నారు. రండలు కేసులు పెడతమంటూ చేసే బెదిరిస్తున్నారని తీవ్ర‌వ్యాఖ్య‌లు చేశారు. మీరు ఆంద్రా బాస్ ల వద్ద మొకరిల్లినప్పుడే మెడలు వంచి తెలంగాణా సాధించామ‌న్నారు. ఉడుత ఉపులు, కుక్క అరుపులు ఏమి చేయలేవన్నారు.

తెలంగాణా మాది, మీది కాదన్నారు. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ముఖ్యమంత్రి, మంత్రి పదవులు కేసీఆర్ దయా దాక్షిణ్యాల తోటేన‌న్నారు. పైసలున్నా కాంగ్రెస్ పాలకులకు పాలన చేత కాదని విమ‌ర్శించారు. కేసీఆర్ నాయకత్వం లో ఎదిగిన వారికే పాలనానుభవం ఉంటుంద‌న్నారు. చంద్రబాబు చెప్పులు మోసినోళ్ళకు, వైయస్ఆర్ బూట్లు నాకినోళ్ళకు పాలనానుభవం ఎట్లా వస్తుందని వ్యాఖ్యానించారు. అప్పులు చెయ్యమన్నదే కాంగ్రెస్ నేతలని.. అప్పులు లేకుంటా అభివృద్ధి జరగదని.. ఆదానీ, అంబానీ లకే అప్పులు తప్పలేదని ఉద‌హ‌రించారు. డిసెంబర్ 9న రుణమాఫీ అన్న కాంగ్రెస్ మాట త‌ప్పింద‌న్నారు.

Next Story