కేటీఆర్ మైనార్టీలపై దొంగ ప్రేమ ఒలకపోస్తున్నారు : షబ్బీర్ అలీ

కేటీఆర్ మైనార్టీలపై దొంగ ప్రేమ ఒలకపోస్తున్నారని షబ్బీర్ అలీ అన్నారు. గాంధీ భ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..

By Medi Samrat  Published on  30 Jan 2024 4:23 PM IST
కేటీఆర్ మైనార్టీలపై దొంగ ప్రేమ ఒలకపోస్తున్నారు : షబ్బీర్ అలీ

కేటీఆర్ మైనార్టీలపై దొంగ ప్రేమ ఒలకపోస్తున్నారని షబ్బీర్ అలీ అన్నారు. గాంధీ భ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీలకు ఏమి చేశారని ప్ర‌శ్నించారు. కామారెడ్డికి వచ్చి మీ అయ్యా ఎందుకు పోటీ చేసిండు.. ఒక్క అమాయకుణ్ణి ఓడగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిండ్రు అని మండిప‌డ్డారు. కేసీఆర్ అధికారంలో వున్నప్పుడు మైనార్టీలకు చేసిందేమి లేదన్నారు.

న‌న్ను కాంగ్రెస్ సర్కార్ సలహాదారుడిగా నియమించిందన్నారు. ఎన్నిక‌ల‌లో నిలబడ్డా మైనార్టీ నేతలు ఓడిపోయారు.. ఏం చేద్దాం మరి.. కాంగ్రెస్ మైనార్టీలకు అవకాశాలు ఇస్తుందన్నారు. ఇప్పటి వరకూ వేసిన టీఎస్‌పీఎస్సీ లో కావచ్చు.. సుప్రీమ్ కోర్టులో ఏజీగా కావ‌చ్చు మైనార్టీల‌కు అవకాశం ఇచ్చిందని వివ‌రించారు. రానున్న రోజుల్లో కూడా మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తదని విశ్వాసం వ్య‌క్తం చేశారు. ముందు మీ అయ్యతో కామారెడ్డికి వచ్చి ఎందుకు పోటీ చేశాడో చెప్పించని డిమాండ్ చేశారు.

Next Story