అప్పుడు నన్ను రిజెక్ట్ చేశారు : సీఎం రేవంత్‌

ఎమ్మెల్యేల వ్యవహారం కోర్టు పరిధిలో, స్పీకర్ పరిధిలో ఉన్నాయని.. దానిపై నేను ఎలాంటి కామెంట్ చేయనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు

By Medi Samrat  Published on  12 Sep 2024 12:45 PM GMT
అప్పుడు నన్ను రిజెక్ట్ చేశారు : సీఎం రేవంత్‌

ఎమ్మెల్యేల వ్యవహారం కోర్టు పరిధిలో, స్పీకర్ పరిధిలో ఉన్నాయని.. దానిపై నేను ఎలాంటి కామెంట్ చేయనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ హైకోర్టు తీర్పు నేను స్టడీ చేయలేదు.. దానిపై నేను ఇప్పుడే ఏ కామెంట్ చేయలేనని పేర్కొన్నారు. గురువారం మీడియా చిట్ చాట్‌లో ఆయ‌న మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు సైకలాజికల్ గేమ్ ఆడుతున్నారని.. ఎవరి కోసం ప్రత్యేక రాజ్యాంగం ఉండదన్నారు.

పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో కాంగ్రెస్ కంటే అత్యధికంగా బీఆర్ఎస్ సభ్యులే ఉన్నారని.. బీఆర్ఎస్ నుంచి ఆరుగురు ఉంటే.. మా పార్టీ నుంచి నలుగురే ఉన్నారన్నారు. మా వాటా నుంచి ఎంఐఎం, బీజేపీ, సీపీఐ పార్టీలకు అవకాశం కల్పించామ‌న్నారు. 2018లో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ.. పీఏసీ చైర్మన్ పదవిని ఎంఐఎం పార్టీకి ఇచ్చారు. 2014లో బిజినెస్ అడ్వైజరీ కమిటీలో టీడీపీ నుంచి నా పేరు, ఎర్రబెల్లి దయాకర్ రావు పేరు ప్రతిపాదిస్తే.. నన్ను రిజెక్ట్ చేశారని గుర్తుచేశారు.

నేతలు పార్టీ ఫిరాయించకుండా చట్టం కఠినంగా ఉంటే మా ప్రభుత్వానికి ఢోకాయే ఉండదన్నారు. మా సంఖ్యాబలం 65.. అందులో నుంచి ఎవరూ మారే అవకాశం ఉండకపోతే మాకే మేలు అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మా ప్రభుత్వాన్ని పడగొడతాం, మూడు నెలల్లో కూల్చేస్తాం అంటున్నాయి.. ప్రభుత్వాన్ని పడగొడతాం అన్నది వాళ్లు.. పడగొట్టే అవకాశమే లేకుండా చట్టం కఠినంగా ఉంటే ఈ పరిస్థితి ఉత్పన్నం కాదన్నారు. ఎమ్మెల్యేల వ్యవహారం కోర్టు పరిధిలో, స్పీకర్ పరిధిలో ఉన్నాయి. దానిపై నేను ఎలాంటి కామెంట్ చేయనన్నారు. పాడి కౌశిక్ రెడ్డి భాషపై ఆ పార్టీ అధినేత స్పష్టత ఇవ్వాలన్నారు. బ్రతకడానికి వచ్చినవారి ఓట్లతోనే హైదరాబాద్ లో ఆ పార్టీ గెలిచిందని కౌంట‌రిచ్చారు.

Next Story