రాజకీయ ప్రయోజనాల కోసం కుల గణన చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మీడియాతో చిట్ చాట్ సందర్బంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఈ నిర్ణయం దేశ చరిత్రలో గుర్తుండిపోయే రోజుగా అభవర్ణించారు. తమ నిర్ణయంతో ప్రధాని మోడీపై ఒత్తిడి పెరుగుతుందని, అన్ని రాష్ట్రాల్లో కుల గణన చేయాలనే డిమాండ్ రానుందని సీఎం చెప్పారు. 76 శాతం బీసీ, ఎస్సీ మైనార్టీలకు న్యాయం జరగనుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న డాక్యుమెంట్స్‌ను భవిష్యత్‌లో రిఫరెన్స్ తీసుకోవాలని అన్నారు. 2011 జనాభా లెక్కల తర్వాత మళ్లీ మేమే కులగణన చేసినట్లు.. సీఎం రేవంత్ చెప్పారు. 2014 లెక్కలు ఎక్కడ ఉన్నాయో చేసిన వాళ్లే చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు నోటీసుల జారీపై కూడా సీఎం రేవంత్ ఈ సందర్భంగా స్పందించారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయా అన్న వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు సీఎం రేవంత్. కోర్టు పరిధిలో ఉన్న వ్యవహారంపై కూడా బీఆర్ఎస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చిట్ చాట్‌లో చెప్పారు.