9,292 ఎకరాల ప్రభుత్వ భూమిని సీఎం రేవంత్ కొట్టేయబోతున్నాడు: కేటీఆర్
5 లక్షల కోట్ల విలువైన దేశంలోనే అతిపెద్ద భూకుంభకోణానికి సీఎం రేవంత్ రెడ్డి తెర తీశారు..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు
By - Knakam Karthik |
9,292 ఎకరాల ప్రభుత్వ భూమిని సీఎం రేవంత్ కొట్టేయబోతున్నాడు: కేటీఆర్
హైదరాబాద్: 5 లక్షల కోట్ల విలువైన దేశంలోనే అతిపెద్ద భూకుంభకోణానికి సీఎం రేవంత్ రెడ్డి తెర తీశారు..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..9,292 ఎకరాల ప్రభుత్వ భూమిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొట్టేయబోతున్నాడు. రేవంత్ భూ కుంభకోణంపై బీజేపీ నేతలు స్పందించాలి. బీజేపీ కూడా కుంభకోణంలో భాగం. అందుకే స్పందించడం లేదు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఇలానే ఉంటుంది. ఏవీ రెడ్డి, కృష్ణారెడ్డి, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డిలకు భూములను అప్పజెప్పే యత్నం జరుగుతుంది. 5 లక్షల కోట్ల విలువైన భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్తున్నారు.
పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగించాల్సిన భూమిని పెద్ద పెద్ద గద్దలకు దారదత్తం చేస్తున్నారు. కుంభకోణంపై పూర్తి అవగాహనతో మాట్లాడుతున్నాను. రేవంత్ రెడ్డి భూకుంభకోణంపై న్యాయపోరాటం చేస్తాం. రేవంత్ ప్రభుత్వంతో పాటు.. భూములు పొందినవారు ఇబ్బందులు పడతారు. పారిశ్రామికవేత్తలు సీఎం రేవంత్ రెడ్డి ట్రాప్ లో పడొద్దు. పెరిగిన భూముల విలువను.. రేవంత్ పేటీఎంగా మార్చుకున్నారు. కొండా సురేఖ కుమార్తె చేసిన ఆరోపణలు క్లాసిక్ ఎగ్జాంపుల్. మెట్రో భూములు, సెంట్రల్ యూనివర్శిటీ భూములపై రేవంత్ రెడ్డి కన్ను పడింది. ప్రజల ఆస్తిని ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులకు అప్పజెప్తున్నారు. మా ప్రభుత్వం వచ్చాక కచ్చితంగా విచారణ జరుపుతాం.అని కేటీఆర్ ఆరోపించారు.
రూ. 5 లక్షల కోట్ల అతి పెద్ద కుంభకోణానికి తెరలేపిన రేవంత్ సర్కార్!దాదాపు 9,300 ఎకరాల ప్రభుత్వ భూములను ఆయన సోదరులకు, బామ్మర్దులకు, వందిమాగధులకు, బ్రోకర్లకు కట్టబెడుతున్న రేవంత్.- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS🔥#CongressLootingTelangana #SCAMgress pic.twitter.com/m53TBoOpqZ
— BRS Party (@BRSparty) November 21, 2025