బీఆర్ఎస్ ఓటమితో తెలంగాణకే నష్టం: కేటీఆర్

ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ, కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ పార్టీలు మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో నిలబడ్డాయి..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

By Knakam Karthik
Published on : 20 April 2025 3:35 PM IST

Telangana, Ktr, Brs, Congress, Cm Revanthreddy, Kcr

బీఆర్ఎస్ ఓటమితో తెలంగాణకే నష్టం: కేటీఆర్

ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ, కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ పార్టీలు మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో నిలబడ్డాయి..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఓటమితో తెలంగాణకే ఎక్కువ నష్టం జరిగింది. కేసీఆర్‌ను మరోసారి సీఎం చేసుకోవడం రాష్ట్ర ప్రజల చారిత్రక అవసరం. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎన్ని కథలు చెప్పినా ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రజలు వారి మాటలను నమ్మలేదు. అసెంబ్లీ ఎన్నిక్లలో ఓఆర్ఆర్ లో కాంగ్రెస్ కు ఒక్క సీటు రాలేదని గోషామహల్ లో మన అభ్యర్థి ఆగమాగం చేయడంతోనే అక్కడ బీజేపీ గెలిచింది. మతం పిచ్చి లేపుడు తప్ప బీజేపీ చేసింది ఏం లేదు. బడే భాయ్ మోడీ నాయకత్వంలో దేశం.. చోటే భాయ్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం వెనక్కిపోతుంది. మోడీ తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు. ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. లోయర్ సీలేరు ప్రాజెక్టును మోడీ గుంజుకున్నారు...అని కేటీఆర్ విమర్శించారు.

2014 వరకు హిందువులు ప్రమాదంలో లేరు, ఇప్పుడు మోడీ అధికారంలోకి వచ్చాక హిందువులు ప్రమాదంలో ఉన్నారా? హిందువులు ప్రమాదంలో ఉన్నారని బీజేపీ అంటే మోడీ ప్రధానిగా ఫెయిల్ అయినట్లే. హిందూ,ముస్లిం,మోడీ జై శ్రీరాం అనకుండా ఓట్లు అడిగే దమ్ము బీజేపీకి ఉందా? కాంగ్రెస్,బీజేపీ ఒక్కటే. తెలంగాణలో రాహుల్,రేవంత్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మోడీ అన్నాడు. రేవంత్ రెడ్డి తన బామ్మర్ది కంపెనీకి అర్హత లేకపోయినా అమృత్ టెండర్లు కట్టబెట్టారు. నేను కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. రాష్ట్రమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఈడీ రైడ్స్ జరిగితే వివరాలు బయటకు రాలేదు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జ్ షీట్ వేస్తే రేవంత్ రెడ్డి సైలెంట్ గా ఉన్నారు. రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలకు ఇది సంకేతమా.? రెండు పార్టీలు ఒక్కటి అయ్యాయా అనేది తెలంగాణ ప్రజలు ఆలోచించాలి..అని కేటీఆర్ అన్నారు.

బీఆర్ఎస్ పాలనలో ఏం తప్పు జరిగింది? బీఆర్ఎస్ ఎందుకు ఖతం కావాలి? మూసీ పేరుతో ఇళ్ళు కూలగొడుతుంటే అడ్డుకున్నది గులాబీ జెండా. లగచర్ల గిరిజన రైతుల కోసం పోరాటం చేసింది గులాబీ జెండా. చేవెళ్ల, రాజేంద్రనగర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు ఖాయం. రేవంత్ రెడ్డి కూలగొట్టే గుంపు మేస్త్రీ. కేసీఆర్ పాలనలో రియల్ ఎస్టేట్ దందా జరగలేదు. హైడ్రాతో పొంగులేటి ఇళ్లు, పట్నం మహేందర్ రెడ్డి, కె.వి.పి, రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇళ్లు కూలగొట్టరు. రేవంత్ రెడ్డి నెగిటివ్ పనులు చేస్తున్నారు. సీఎం కాగానే ఎయిర్ పోర్టుకు మెట్రోను రద్దు చేశారు. నా భూములు ఉన్నాయని రేవంత్ రెడ్డి ఎయిర్ పోర్ట్ మెట్రో రద్దు చేశారు అంట. ఫార్మా సిటీ రద్దు అన్నారు, ఇప్పుడు ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ అంటున్నారు. మూసీకి లక్షన్నర కోట్లు ఖర్చు పెడతానని రేవంత్ రెడ్డి అంటున్నారు. రేవంత్ రెడ్డికి ఫోజులు ఎందుకు? ఆహా నా పెళ్ళంట సినిమాలో కోడి కథలా రేవంత్ రెడ్డి పనితీరు ఉంది..కేటీఆర్ విమర్శించారు.

Next Story