పండుగ పూట విద్యార్థుల నెత్తురు కళ్ల చూడటం ప్రజాపాలన అవుతుందా.? : ఏలేటి
తెలంగాణలో నిర్బంధ, అరాచక పాలన కొనసాగుతుంది..అని బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
By Knakam Karthik
వారి మెప్పు కోసం భూములు అమ్ముతున్నారా? రియల్ ఎస్టేట్ దందానే లక్ష్యమా?: ఏలేటి
తెలంగాణలో నిర్బంధ, అరాచక పాలన కొనసాగుతుంది అని బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.భూములను అమ్ముకోవడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ పని చేస్తోంది. అభివృద్ధి అంటే ప్రభుత్వ ఆస్తులు అమ్ముకోవడమా? భూములు అమ్మడం, రియల్ ఎస్టేట్ దందా చేయడమే రేవంత్ సర్కార్ లక్ష్యమా అనేది చెప్పాలి. ఎంతకాలం నిర్బంధిస్తారు? ఎంతకాలం అడ్డుకుంటారు? తప్పకుండా సెంట్రల్ యూనివర్సిటీ భూముల దగ్గరకు వెళ్తాం. విద్యార్థుల వైపున నిలబడుతాం. వేలం నిలిపివేయకపోతే జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి..అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.
రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలను సందర్శిస్తాం, విద్యార్థులను కలుస్తాం. ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు పట్టిన గతే రేపు అన్ని యూనివర్సిటీలకు పడుతుంది. 2300 ఎకరాల భూమిని నాడు ఇందిరాగాంధీ సెంట్రల్ యూనివర్సిటీకి అప్పగించడం జరిగింది. నేడు రేవంత్ రెడ్డి ఆ భూములను ఏదో రకంగా అమ్ముకోవాలి, దందా చేయాలని చూస్తున్నారు. ఉగాది పండుగ రోజున సెంట్రల్ వర్సిటీ విద్యార్థులపై లాఠీ ఝులిపించడం ప్రజాపాలన అవుతుందా? పండుగ పూట విద్యార్థుల నెత్తురు కళ్ల చూడటం ప్రజాపాలన అవుతుందా?. బీఆర్ఎస్ బాటలో కాంగ్రెస్ నడుస్తోంది, దుర్మార్గమైన పాలన కొనసాగిస్తోంది. రియల్ ఎస్టేట్ దందా కోసమే రేవంత్ సర్కార్ పని చేస్తోంది...అని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
యూనివర్సిటీ భూముల్లో విశేష జంతు సంపద ఉంది, అలాంటి ఫారెస్ట్ భూమిని విధ్వంసం చేస్తారా? గుంట నక్కలు ఎవరో రేవంత్ చెప్పాలి? భూములను తాకట్టు పెట్టిన రేవంత్ రెడ్డి క్లాజ్ తీసుకున్నారు. శ్రీధర్ బాబు, రేవంత్ రెడ్డి మాటలకు పొంతన లేకుండా ఉన్నాయి. విద్యార్థులపై పెట్టిన కేసులను భేషరతుగా ఎత్తివేయాలి. యూనివర్సిటీ భూములపై ముఖ్యమంత్రి అఖిలపక్ష కమిటీ వేయాలి. కూనంనేని సాంబశివరావు, ప్రొఫెసర్ కోదండరాంలకు సెంట్రల్ వర్సిటీ భూములపై విద్యార్థుల పోరాటాలు కనిపించడంలేదా? ఎందుకు పార్టీ ఆఫీసులకే పరిమితం అయ్యారు? నిజ నిర్ధారణ కమిటీ వేసి ప్రభుత్వం.. భూములపై లెక్కలు తేల్చేంతవరకు పోరాటం కొనసాగిస్తాం..అని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.