ఈ ఏడాది చివర్లో నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం బీజేపీ కట్టుదిట్టంగా ప్రణాళికలు రచిస్తుంది. ఈ క్రమంలోనే నాలుగు రాష్ట్రాలకు ఇన్‌చార్జ్‌లను ప్రకటించింది. శుక్రవారం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా.. నాలుగు రాష్ట్రాలకు బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించారు. భూపేంద్ర యాదవ్‌ను మధ్యప్రదేశ్ ఇంచార్జ్‌గా నియమించింది. తెలంగాణ ఇంచార్జిగా ప్రకాష్ జవదేకర్ నియమితులయ్యారు. ప్రహ్లాద్ జోషికి రాజస్థాన్ బాధ్యతలు అప్పగించారు. ఛత్తీస్‌గఢ్ కు ఓం ప్రకాష్ మాథుర్‌ను ఛత్తీస్‌గఢ్ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. వీరితో పాటు సహ-ఇంఛార్జుల జాబితాను కూడా ప్రకటించింది అధిష్టానం. ఛత్తీస్‌గఢ్‌కు మన్సుఖ్ మాండవియా, రాజస్థాన్‌కు నితిన్ పటేల్, కుల్దీప్ బిష్ణోయ్, తెలంగాణకు సునీల్ బన్సాల్, మధ్యప్రదేశ్‌కు అశ్విని వైష్ణవ్ లు కో-ఇంఛార్జులుగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఓ ప్రకటనను కూడా విడుదల చేశారు.