ఆ కేసులో కేసీఆర్, కేటీఆర్ పాత్రపై విచారించాలి: బండి సంజయ్

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ శనివారం డిమాండ్ చేశారు

By Medi Samrat  Published on  1 Jun 2024 11:42 AM GMT
ఆ కేసులో కేసీఆర్, కేటీఆర్ పాత్రపై విచారించాలి: బండి సంజయ్

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ శనివారం డిమాండ్ చేశారు. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ఇందులో చాలా మందికి ప్రమేయం ఉందని.. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కేసును సీబీఐకి అప్పగించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ రాశారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ కేసును దర్యాప్తు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి సీబీఐకి లేఖ రాయాలని సూచించారు.

అదే సమయంలో రాష్ట్రంలోకి సీబీఐ ప్రవేశాన్ని అడ్డుకుంటూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును ఉపసంహరించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ కోరారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు , ఆయన తనయుడు కేటీ రామారావు ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా ప్రతిపక్ష పార్టీలపై సైబర్‌ దాడి చేశారని.. దర్యాప్తు సంస్థలు వారికి నోటీసులు జారీ చేయాలని కోరారు. అంతేకాకుండా ఈ కేసులో వారి పాత్రను విచారించాలన్నారు.

Next Story