గొడ్డలి పాతదే, కానీ చేతులు కొత్తవి..కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై బండి ఫైర్

తెలంగాణ రాష్ట్రంలో గ్రీన్ మర్డర్ జరుగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.

By Knakam Karthik
Published on : 31 March 2025 6:23 AM

Telangana, Bandi Sanjay, Congress Government, Brs, Kcr, Cm Revanthreddy, Hyderabad Central University

గొడ్డలి పాతదే, కానీ చేతులు కొత్తవి..కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై బండి ఫైర్

తెలంగాణ రాష్ట్రంలో గ్రీన్ మర్డర్ జరుగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై ఇలా రాసుకొచ్చారు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ కాళేశ్వరం పేరుతో 25 లక్షల చెట్లను నరికివేసి హరితహారం ముసుగులో కోనోకార్పస్ మొక్కలను బహుమతిగా ఇచ్చిందని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం కంచ గచ్చిబౌలి ప్రాంతంలో జరుగుతున్న హరిత విధ్వంసంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేరింది. బీఆర్ఎస్ హయాంలో ఉన్న గొడ్డలి, కొత్త చేతులు మారింది. బీఆర్ఎస్ కోత, కాంగ్రెస్ కోతలు మరింత లోతుగా ఉన్నాయి. ఈ రెండు పార్టీలు తెలంగాణను పరిపాలించబడటంల లేదు. అటవీ నిర్మూలన మాఫియాలో బందీగా మారింది..అని బండి సంజయ్ పేర్కొన్నారు.

కాగా హైదరాబాద్ ఐటీ హబ్ కు అతి సమీపంలో ఉన్న కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని వేలం వేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ భూమికి సంబంధించి మాస్టర్ లే ఔట్ డిజైన్ చేసి విక్రయించేందుకు గాను ఇప్పటికే తెలంగాణ ఇండస్ట్రీయల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ రంగంలోకి దిగింది. నిన్న భూమిని చదును చేస్తుండగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. పనులు ఆపాలని జేసీబీలకు అడ్డంగా బైఠాయించిన నిరసన వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

Next Story