మహారాష్ట్ర ప్రభుత్వం వద్దంటోంది.. సుశాంత్ కేసు సీబీఐకి అప్పగించిన సుప్రీం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Aug 2020 12:15 PM IST
మహారాష్ట్ర ప్రభుత్వం వద్దంటోంది.. సుశాంత్ కేసు సీబీఐకి అప్పగించిన సుప్రీం

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు సీబీఐకి అప్పగించాలంటూ దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్న సమయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పును ఇచ్చింది.

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసు విచారణను సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది. దర్యాప్తు వివరాలను సీబీఐకి అప్పగించాలని ముంబై పోలీసులను సుప్రీంకోర్టు సూచించింది. సీబీఐ విచారణకు సహకరించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. సుశాంత్‌ సన్నిహితురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌డం న్యాయ‌బ‌ద్ద‌మైన‌ని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

సీబీఐ విచారణకు మహారాష్ట్ర ప్రభుత్వం మొదటి నుండి వ్యతిరేకిస్తోంది. బీహార్, మహారాష్ట్ర పోలీసులు విచారణ జరుపుతున్న సమయంలో సమన్వయ లోపం కొన్ని వివాదాలు కూడా తావెత్తాయి. ఈ కేసును సీబీఐ కి అప్పగించాలని బీహార్‌ ప్రభుత్వం ఇప్పటికే సిఫారసు చేసింది. అంతేగాక, ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్టు ఇప్పటికే కేంద్రం కూడా తెలిపింది.

ఈ కేసును సీబీఐకి అప్పగించాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తోన్న బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టు నిర్ణయంపై 'సీబీఐ జయహో' అంటూ ట్వీట్ చేశారు. పలువురు ప్రముఖులు, సుశాంత్ అభిమానులు సుప్రీం కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. సుశాంత్ కు తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Next Story