సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ కోట్లు కొట్టేసిందన్నారు.. కానీ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Aug 2020 9:29 AM GMT
సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ కోట్లు కొట్టేసిందన్నారు.. కానీ

సుశాంత్ సింగ్ రాజ్ పుత్‌ మృతికి బాధ్యురాలిగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది అతడి ప్రేయసి రియా చక్రవర్తి. సుశాంత్ దగ్గర ఆమె కోట్లు కొట్టేసినట్లు వార్తలొచ్చాయి. సుశాంత్ చనిపోవడానికి ముందు నెలా రెండు నెలల్లో ఆమె అతడి అకౌంట్ నుంచి రూ.3 కోట్ల దాకా డ్రా చేసినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి.

మొత్తంగా అతడి అకౌంట్ నుంచి ఆమె రూ.15 కోట్ల దాకా లాగేసినట్లు కథనాలు వచ్చాయి. సుశాంత్ కుటుంబ సభ్యులు కూడా ఆమెపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతోనే ఈ కేసు విచారణ మలుపు తిరిగింది. అన్ని వేళ్లూ రియా వైపు చూపించిన నేపథ్యంలో కచ్చితంగా ఆమె సుశాంత్‌కు అన్యాయం చేసిందనే అనుమానాలు బలపడ్డాయి.

కానీ ఈ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. రియాను గత కొన్ని రోజులుగా విచారిస్తున్న ఈడీ.. ఆమె బ్యాంక్ అకౌంట్లతో పాటు అన్ని ఆర్థిక లావాదేవీలను పరిశీలించి.. ఎలాంటి ఆర్థిక అవకతవకకూ లేనట్లు నిర్ధారించింది. సుశాంత్ అకౌంట్ నుంచి రియా అకౌంట్‌కు ఒక్క రూపాయి కూడా ట్రాన్స్‌ఫర్ కాలేదని తేల్చింది. ఈ మేరకు ప్రాథమికంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

దీంతో ఇన్నాళ్లూ రియా మీద వచ్చిన ఆరోపణలన్నీ ఎవరో ఉద్దేశపూర్వకంగా పుట్టించినవా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐతే సుశాంత్ అకౌంట్ నుంచి రియాకు ట్రాన్స్‌ఫర్ జరగకపోయినా.. అతడి డబ్బును ఆమె వాడుకుందని, అతడితో తన కోసం కోట్లు ఖర్చు చేసిందని.. లిక్విడ్ క్యాష్ చాలానే ఆమె దగ్గర ఉందని సుశాంత్ సన్నిహితులు అంటున్నారు. ఈ విషయంలో ఏం తేలుతుందో చూడాలి మరి.

Next Story