న‌టుడు, సినీ క్రిటిక్‌ క‌త్తి మ‌హేష్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముని మీద ఫేస్ బుక్‌లో కత్తి మహేష్ అసభ్య కామెంట్స్ చేశారంటూ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదులు అందాయి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న్ను అదుపులోకి తీసుకున్న‌‌ పోలీసులు..‌ నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన‌ట్టు స‌మాచారం.

ఇదిలావుంటే గ‌తంలో కూడా క‌త్తి మ‌హేష్.. అగ్ర‌క‌థానాయకు‌లుపై ప‌లు అభ్యంత‌ర‌క‌ర‌మైన‌ కామెంట్స్ చేసి వార్త‌ల్లో నిలిచాడు. అలాగే దేవుళ్ల‌పై చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో దుమారం రేపాయి.

బిగ్ బాస్ తెలుగు సీజన్-1కంటెస్టెంట్ అయిన‌ కత్తి మహేష్.. హృదయ కాలేయం, నేనే రాజు నేనే మంత్రి, కొబ్బరి మట్ట, పవర్ స్టార్, ప‌రాన్న జీవి వంటి పలు సినిమాల్లో నటించడంతో పాటు.. పెసరట్టు అనే సినిమాను కూడా డైరెక్ట్‌ చేశారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.