సూపర్‌స్టార్‌తో క్రికెట్ స్టార్

Varun Chakravarthy Meet With Hero Vijay. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌)2020 సీజ‌న్‌లో కోల్‌క‌త్తా నైట్‌రైడ‌ర్స్

By Medi Samrat  Published on  18 Nov 2020 1:25 PM IST
సూపర్‌స్టార్‌తో క్రికెట్ స్టార్

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌)2020 సీజ‌న్‌లో కోల్‌క‌త్తా నైట్‌రైడ‌ర్స్ త‌రుపున బ‌రిలోకి దిగిన వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి.. త‌న స్పిన్ మాయాజాలంతో ప్ర‌త్య‌ర్థి బ్యాట్స్‌మెన్ల‌ను ముప్పు తిప్ప‌లు పెట్టాడు. కోల్‌క‌త్తాకు కొన్ని మ‌రిచిపోలేద‌ని విజ‌యాల‌ను అందించాడు. దీంతో అత‌డి పేరు మారుమోగిపోయింది. కాగా.. అత‌డికి ఇష్ట‌మైన సినిమా స్టార్ విజ‌య్‌. అత‌డిని ఎప్ప‌టి నుంచో క‌ల‌వాల‌ని అనుకుంటున్నాడు.



తమిళ్ స్టార్ హీరో, ద‌ళ‌ప‌తి విజ‌య్ ఆఫీసుకు వెళ్లి మ‌రీ వ‌రుణ్ అతడిని కలిశాడు. ఇద్దరూ క‌లిసి కాసేపు ముచ్చ‌టించారు. ఈ సంద‌ర్భంగా దిగిన ఫొటోను వరుణ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ఒకే ఫ్రేములో ఇద్ద‌రు సెల‌బ్రిటీల‌ను ఔరా అనిపించారు. విజ‌య్ న‌టిస్తోన్న 'మాస్ట‌ర్' చిత్రం కోసం అభిమానుల‌తో పాటు వ‌రుణ్ కూడా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాడు. థియేటర్లు ఎప్పుడు పూర్తి స్తాయిలో రన్ చేస్తాయో అప్పుడు చిత్రాన్ని విడుదల చేయాల‌ని మాస్ట‌ర్ చిత్ర నిర్మాత‌లు బావిస్తున్నారు. మరో వైపు విజయ్ కొత్త సినిమాకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇదే సమయంలో విజయ్ రాజకీయ రచ్చ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆయన తండ్రి పార్టీ పెట్టడంతో చర్చ తీవ్రతరం అయ్యింది. ఇద్దరి మద్య విభేదాలు భగ్గుమ‌న్నాయి. విజ‌య్ కూడా క్రికెట్‌కు వీరాభిమాని. 2008 ఐపీఎల్ లీగ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ జట్టు‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్యవహరించాడు.

ఐపీఎల్‌లో వ‌రుణ్ ప్ర‌ద‌ర్శ‌న ప‌ట్ట సంతృప్తి చెందిన బీసీసీఐ సెలెక్ట‌ర్లు.. అత‌డిని ఆసీస్‌ పర్యటన కోసం ప్రకటించిన భారత టీ20 జట్టులో ఎంపిక చేశారు. అయితే.. భుజం నొప్పితో బాధ‌ప‌డుతున్నందు వ‌ల్ల ఈ స్టార్ స్పిన్న‌ర్‌ టీ20 సిరీస్‌కు దూర‌మ‌య్యాడు


Next Story