న్యూస్‌మీటర్ టాప్ 10 న్యూస్
By సుభాష్ Published on 30 May 2020 9:31 PM ISTఇకపై స్కూళ్లు 100 రోజులే..!
దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక కరోనా కట్టడిలో భాగంగా దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్ మే 31తో ముగియనుంది. దీంతో కరోనా ఉధృతి తీవ్రంగా ఉండటంతో మరో రెండు వారాలు పొడిగించే అవకాశాలున్నాయి... పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ప్రభాస్ సినిమాలో దీపిక.. ఇదిగో రుజువు
బాహుబలి మాత్రమే కాదు.. గత కొన్నేళ్లలో తెలుగు సినిమా సత్తాను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చాటిన సినిమాలు చాలానే ఉన్నాయి. కంటెంట్ పరంగా చూస్తే బాహుబలిని మించిన సినిమాలు మన దగ్గర వచ్చాయి. అందులో మహానటి కూడా ఒకటి. ఈ చిత్రం వందల కోట్ల వసూళ్లు సాధించకపోయి ఉండొచ్చు. కానీ తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయే గొప్ప సినిమాల్లో ఇదొకటి... పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
జూన్ 8వ తేదీ వరకూ పొడిగింపు: సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలను జూన్ 8వ తేదీ వరకూ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులకు శనివారం ఆదేశాలు జారీ చేశారు. ముందుగా ..పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
దేశంలో జూన్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగింపు.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు
దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండటంతో జూన్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. మే 31 లాక్‌డౌన్ 4.0 ముగియనుండటంతో దానిని పొడిగిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అలాగే లాక్‌డౌన్-5లో కొత్త మార్గదర్శకాలను సైతం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇండియా పేరును అలా మార్చాలట.. సుప్రీంలో పిటిషన్
ఇప్పుడున్న సమస్యలు సరిపోవన్నట్లు.. ఇప్పుడు మరో భారీ చర్చకు తెర తీసేలా సుప్రీంలో ఒక పిటిషన్ దాఖలైంది. దీని ప్రకారం ఇండియా పేరును భారత్ కానీ హిందూస్థాన్ గా మార్చాలంటూ వ్యాజ్యం దాఖలైంది. దేశం పేరును మార్చేలా రాజ్యాంగాన్ని సవరించాలని అందులో పేర్కొన్నారు. ఈ అంశంపై కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వాలని కోరారు... పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
మోదీ పాలకు ఏడాది పూర్తి..భారతావనిపై మోదీ చెరగని ముద్ర
దేశ ప్రధాని నరేంద్రమోదీ రెండో సారి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. శనివారం నాటితో ఎన్డీయే ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. గత ఐదేళ్ల పాలన కంటే భిన్నంగా ఉందని, కొన్ని సాహసోపేత నిర్ణయాలు మోదీ తీసుకున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రెండోసారి గద్దెనెక్కిన మోదీ.. భారతావనిపై తనదైన చెరగని ముద్ర వేసుకున్నారు. తన పాలనలో పలు కీలక నిర్ణయాలు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
భారత్‌లో తీవ్రరూపం దాలుస్తోన్న కరోనా.. రికార్డు స్థాయిలో కేసులు నమోదు
భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 7964 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 265 మృతి చెందారని కేంద్ర, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. కరోనా మహమ్మారి భారత్‌లో విజృంభణ మొదలైన తరువాత ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. వీటితో కలిపి దేశంలో కరోనా బాధితుల సంఖ్య... పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
మంచు లక్ష్మి పెళ్లి ముచ్చట్లు
సెలబ్రెటీల వ్యక్తిగత వ్యవహారాలపై జనాలకు భలే ఆసక్తి ఉంటుంది. వాళ్ల ప్రేమ, పెళ్లి లాంటి విషయాలపై అమితాసక్తిని ప్రదర్శిస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే మంచు లక్ష్మీ ప్రసన్న తాజాగా సోషల్ మీడియా ద్వారా తన పెళ్లి ముచ్చట్లు పంచుకుంది. అమెరికాలో స్థిరపడ్డ ఎన్నారై ఆండీ శ్రీనివాసన్‌తో మంచు లక్ష్మి పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ టైంలో తన పెళ్లి ఆల్బమ్‌ను... పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఏసీ, కూలర్, ఫ్యాన్లు ఎక్కువగా వాడుతున్నారా ? అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..
వేసవి కాలం అంటే చాలు.. బాబోయ్ ఎండలా ? అనే పరిస్థితి ఏర్పడింది. సుమారు 10 -15 సంవత్సరాల క్రితం వేసవికాలం అంటే మార్చి, ఏప్రిల్, మే నెలల వరకూ మాత్రమే ఉండేది. జూన్ మధ్య నుంచి వర్షాలు పడటంతో వర్షాకాలం మొదలయ్యేది. కానీ రాను రాను వేసవి కాలం జనవరి నుంచే మొదలైపోతోంది. ఈ ఏడాది జనవరి చివరి నుంచే మండే ఎండలు మొదలయ్యాయి... పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఆ ఇద్దరిని ఔట్ చేయలేక జోక్‌లు వేసుకున్నాం : అఫ్రిది
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తాజాగా ఓ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ఈ ఫోటో ఎప్పటిదో కనిపెట్టమంటూ అభిమానులకు పజిల్ ఇచ్చింది. ఈ ఫోటోలో షోయబ్ అక్తర్, షాహిద్ అఫ్రిది ఇద్దరూ నవ్వుతూ కనిపించారు. ఈ ఫోటోపై అఫ్రిది స్పందించాడు... పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి