దేశంలో జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు

By సుభాష్  Published on  30 May 2020 2:45 PM GMT
దేశంలో జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు

దేశంలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండటంతో జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. మే 31 లాక్‌డౌన్‌ 4.0 ముగియనుండటంతో దానిని పొడిగిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అలాగే లాక్‌డౌన్‌-5లో కొత్త మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. జూన్‌ 8వ తేదీ నుంచి ఆలయాలు, ప్రార్థనాల స్థలాలు కూడా తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది.

అలాగే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూను పరిమితం చేసింది. రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి, అలాగే మరో రాష్ట్రానికి వెళ్లేందుకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు లాక్‌డౌన్‌కు సంబంధించి కేంద్ర హోంశాఖ జారీ చేసింది.

► కంటైన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ జూన్‌ 3 వరకు కొనసాగుతుంది

► కంటైన్‌మెంట్ జోన్‌ పరిధిలోని జిల్లా అధికారులు నిర్ధిశిస్తారు.

► కంటైన్మెంట్‌ జోన్లలో కేవలం నిత్యావసర వస్తువులకు మాత్రమే అనుమతి ఉండాలి. ► జోన్లలో నుంచి ప్రజలెవ్వరు బయటకురాకుండా చర్యలు చేపట్టాలి.

► కంటైన్‌మెంట్‌ జోన్‌లో బయట బఫర్‌జోన్లపై రాష్ట్రాలు, కేంద్ర పాలిన ప్రాంతాలు నిర్ణయం తీసుకోవచ్చు. వివిధ దశల్లో వివిధ రకాలైన సంస్థలు తెరుచుకోవడానికి అనుమతులు ఇస్తూ హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.

జూన్‌ 8 నుంచి..

ఫేజ్‌ -1

► ఆలయాలు, ప్రార్థనా మందిరాలకు అనుమతి

► హోటళ్లు, రెస్టారెంట్లు, వసతి సేవలు, షాపింగ్ మాల్స్‌కు అనుమతి.

►కర్ఫ్యూ సమయం మరింత సడలింపు ఇస్తూ, రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ

ఫేజ్‌ - 2

► పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు తెరిచేందుకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకే అధికారం

► విద్యాసంస్థలు పునః ప్రారంభంపై జులైలో నిర్ణయం

►విద్యాసంస్థలు పునః ప్రారంభం విషయంలో కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలను జారీ చేస్తుంది.

ఫేజ్‌ - 3

►అంతర్జాతీయ విమాన సేవలు (కేంద్ర హోంశాఖ అనుమతులతో)

► మెట్రో రైలు వ్యవస్థకు అనుమతి

►జిమ్ములు, సినిమాహాళ్లు, స్విమ్మింగ్‌ ఫూల్స్‌, పార్కులు, బార్లు

► ఆడిటోరియంలు, అసెంబ్లీ హాల్స్‌, సమావేశ ప్రాంతాలు

► రాజకీయ, విద్యా, సాంస్కృతి, మతపరమైన సమావేశాలు

వీటికి పరిస్థితులను బట్టి అనుమతులు ఉంటాయి.

లాక్‌డౌన్‌ 5.0లో అనుమతి లేనివి:

► మెట్రో రైలు సేవలకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. అలాగే అంతర్జాతీయ విమానలకు అనుమతి లేదు

► రాజకీయ, సామాజిక, క్రీడా కార్యక్రమాలపై ప్రస్తుతానికి అనుమతి లేదు.

Next Story