దేశంలో జూన్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగింపు.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు
By సుభాష్ Published on 30 May 2020 8:15 PM ISTదేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండటంతో జూన్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. మే 31 లాక్‌డౌన్ 4.0 ముగియనుండటంతో దానిని పొడిగిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అలాగే లాక్‌డౌన్-5లో కొత్త మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. జూన్ 8వ తేదీ నుంచి ఆలయాలు, ప్రార్థనాల స్థలాలు కూడా తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది.
అలాగే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూను పరిమితం చేసింది. రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి, అలాగే మరో రాష్ట్రానికి వెళ్లేందుకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు లాక్‌డౌన్‌కు సంబంధించి కేంద్ర హోంశాఖ జారీ చేసింది.
► కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్ జూన్ 3 వరకు కొనసాగుతుంది
► కంటైన్‌మెంట్ జోన్ పరిధిలోని జిల్లా అధికారులు నిర్ధిశిస్తారు.
► కంటైన్మెంట్ జోన్లలో కేవలం నిత్యావసర వస్తువులకు మాత్రమే అనుమతి ఉండాలి. ► జోన్లలో నుంచి ప్రజలెవ్వరు బయటకురాకుండా చర్యలు చేపట్టాలి.
► కంటైన్‌మెంట్ జోన్‌లో బయట బఫర్‌జోన్లపై రాష్ట్రాలు, కేంద్ర పాలిన ప్రాంతాలు నిర్ణయం తీసుకోవచ్చు. వివిధ దశల్లో వివిధ రకాలైన సంస్థలు తెరుచుకోవడానికి అనుమతులు ఇస్తూ హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.
జూన్ 8 నుంచి..
ఫేజ్ -1
► ఆలయాలు, ప్రార్థనా మందిరాలకు అనుమతి
► హోటళ్లు, రెస్టారెంట్లు, వసతి సేవలు, షాపింగ్ మాల్స్‌కు అనుమతి.
►కర్ఫ్యూ సమయం మరింత సడలింపు ఇస్తూ, రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ
ఫేజ్ - 2
► పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు తెరిచేందుకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకే అధికారం
► విద్యాసంస్థలు పునః ప్రారంభంపై జులైలో నిర్ణయం
►విద్యాసంస్థలు పునః ప్రారంభం విషయంలో కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలను జారీ చేస్తుంది.
ఫేజ్ - 3
►అంతర్జాతీయ విమాన సేవలు (కేంద్ర హోంశాఖ అనుమతులతో)
► మెట్రో రైలు వ్యవస్థకు అనుమతి
►జిమ్ములు, సినిమాహాళ్లు, స్విమ్మింగ్ ఫూల్స్, పార్కులు, బార్లు
► ఆడిటోరియంలు, అసెంబ్లీ హాల్స్, సమావేశ ప్రాంతాలు
► రాజకీయ, విద్యా, సాంస్కృతి, మతపరమైన సమావేశాలు
వీటికి పరిస్థితులను బట్టి అనుమతులు ఉంటాయి.
లాక్‌డౌన్ 5.0లో అనుమతి లేనివి:
► మెట్రో రైలు సేవలకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. అలాగే అంతర్జాతీయ విమానలకు అనుమతి లేదు
► రాజకీయ, సామాజిక, క్రీడా కార్యక్రమాలపై ప్రస్తుతానికి అనుమతి లేదు.