చంద్ర‌బాబు 14ఏళ్లు సీఎంగా ఉన్నా.. ఇలాంటి అత్య‌వ‌స‌ర సేవ‌లు చేశారా.?

By Medi Samrat  Published on  7 July 2020 1:49 PM GMT
చంద్ర‌బాబు 14ఏళ్లు సీఎంగా ఉన్నా.. ఇలాంటి అత్య‌వ‌స‌ర సేవ‌లు చేశారా.?

ఏపీఐఐసీ చైర్మ‌న్‌, న‌గ‌రి ఎమ్మెల్యే రోజా నేడు పుత్తూరులో 108, 104 వాహనాలను ప్రారంభించారు. కార్య‌క్ర‌మంలో ముందుగా రోజా పున్నమి హాటల్ కూడలి వద్ద ఉన్న వైయస్ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోనే.. ఏ రాష్ట్రంలోను.. ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచన వైఎస్ జగన్‌కు రావడం ఆనందకరమని.. రాష్ట్రానికి మొత్తం 1088 వాహనాలను, అలాగే ప్రతి మండలానికి 108, 104 ఏర్పాటు చేయడం అనేది ప్రజల ఆరోగ్యానికి జగన్‌ ఇస్తున్న భరోసా అని ఆమె అన్నారు. అలాగే.. నగరి నియోజకవర్గానికి కూడా 5 వాహనాల చొప్పునా 108, 104లు అందించారాన్నారు.

చంద్రబాబు, టీడీపీ పార్టీ 108, 104ల‌ గురించి విమర్శంచడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని అన్నారు. రూ. 203కోట్లతో 108, 104 వాహ‌నాల‌నును ఏర్పాటు చేస్తే, చంద్రబాబు వందల కోట్లు అవినీతి జరిగిందని చెప్పడం దారుణమని పైర‌య్యారు. చంద్రబాబు 14 ఏళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలా ప్రజలకు 108, 104 లాంటి అత్యవసర సేవలు చేశారా.? అని ఆమె ప్రశ్నించారు. అలాగే దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి తీసుకుని వచ్చిన అత్యవసర సేవలను సైతం చంద్రబాబు మూలన పడేశారని ఫైర‌య్యారు.

కరోనా బారిన పడిన ప్రజలకు ధైర్యం చెప్పలేని తెలుగుదేశం పార్టీ నాయకులు, వాళ్ల పార్టీకి సంబంధించిన అవినీతిపరులు అరెస్ట్ చేయడంతో రోడ్డు మీదకు వచ్చారని ఆరోపించారు. నగిరి నియోజకవర్గంలో తన మీద పోటీ చేసిన గాలి భాను ప్రకాష్ సైతం ఎక్కడో దొంగల కూర్చొని ప్రెస్ మీట్ లు పెడుతుంటాడని అని ఎద్దేవా చేశారు.

అచ్చం నాయుడు బీసీ అని టీడీపీ నేత‌లు మాట్లాడుతున్నార.. అయితే ఆయన అవినీతి చేసి తినేసిన డబ్బులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబందించినవి కాదా అని ఆమె ప్రశ్నించారు. కొల్లు రవీంద్రను అరెస్టు చేస్తే.. కక్షసాధింపు చర్యగా మాట్లాడుతున్నారని.. అయితే ఆయన చంపిన భాస్కర్ రావు ఏ కులానికి సంబంధించిన వారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. అయినా చంపేసిన వ్యక్తిపై కేసు పెడితే తప్పేంటని ఆమె ప్రశ్నించారు. ఇలాగే కొనసాగితే చంద్రబాబు పార్టీకి 23 సీట్లు కూడా లేకుండా మూలన కూర్చోవాల్సిన ప‌రిస్థితి వస్తుందని ఆమె జోస్యం చెప్పారు. అనంత‌రం ఎటువంటి త‌డ‌బాటు లేకుండా 108 వాహ‌నం న‌డిపి మాట‌లోనే కాదు.. చేత‌ల్లోనూ ఫైర్ బ్రాండే అనిపించుకున్నారు ఎమ్మెల్యే రోజా.

Next Story