ఏపీలో కరోనా తీవ్రతరం దాల్చింది. ప్రతి రోజువందల సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 16,238 సాంపిల్స్‌ని పరీక్షించగా.. కొత్తగా 1178 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది.

వీటిలో రాష్ట్రానికి చెందిన వారు 22 మంది కాగా.. విదేశాల నుంచి వచ్చినవారు ఒక్క‌రున్నారు. వీటితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 21197కి చేరింది. ఇక తాజాగా క‌ర్నూల్‌లో న‌లుగురు, అనంతపూర్‌లో ముగ్గురు, చిత్తూరులో ఇద్ద‌రు, విశాఖలో ఇద్ద‌రు, ప్ర‌కాశం, ప‌శ్యిమ గోదావ‌రి జిల్లాల‌లో ఒక‌రు చొప్పున మ‌ర‌ణించారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 252కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 9745 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 11200మంది చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా

అనంతపూర్‌ : 153

చిత్తూరు : 66

గుంటూరు : 238

ఈస్ట్‌ గోదావరి : 112

కడప : 28

కృష్ణ : 100

కర్నూలు : 84

నెల్లూరు : 39

ప్రకాశం : 29

శ్రీకాకుళం : 104

విశాఖ : 123

విజయనగరం : 30

వెస్ట్‌ గోదావరి : 49సామ్రాట్

Next Story