విశాఖపట్నంలోని గోపాలపట్నంలో ఎల్జీ పాలిమర్స్ సంస్థలో స్టెరీన్ గ్యాస్ లీక్ అయి 12 మంది ప్రాణాలు కోల్పోయిన దారుణ ఉదంతం చోటు చేసుకుని అప్పుడే రెండు నెలలు కావస్తోంది. కొన్ని రోజుల పాటు చర్చనీయాంశం అయిన ఈ విషాదాంతం గురించి తర్వాత అందరూ మరిచిపోయారు. ఐతే ఇప్పుడు మళ్లీ ఆ ఘటన వార్తల్లోకి వచ్చింది. ఈ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ.. తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ దుర్ఘటనకు సంబంధిచి 11 భాగాలతో 4 వేల పేజీల నివేదికను కమిటీ ప్రభుత్వానికి అందజేసింది. పన్నెండు మంది ప్రాణాలు పోవడంతో పాటు వందల మంది అస్వస్థతకు గురయ్యేలా చేసిన ఈ ప్రమాదానికి సంబంధించి కొన్ని రోజుల కిందటే సంకేతాలు కనిపించినప్పటికీ ఎల్జీ పాలిమర్స్ సంస్థ జాగ్రత్త పడటంలో విఫలమైందని ఈ నివేదికలో పేర్కొన్నట్లు కమిటీ తేల్చింది.

మే 7న ఈ ప్రమాదం చోటు చేసుకోగా.. అంతకు రెండు వారాల ముందు.. అంటే ఏప్రిల్ 24న స్టెరీన్ ట్యాంకుల్లో పాలిమర్స్ పరిమాణం అసాధారణంగా పెరుగుతున్నట్లు సంస్థ ప్రతినిధులు గుర్తించారట. అయితే దాన్ని ప్రమాద హెచ్చరికగా పరిగణించలేదట. అప్పుడే తగిన నియంత్రణ చర్యలు చేపట్టి ఉంటే ఆ ప్రమాదం చోటు చేసుకునేదే కాదని కమిటీ అభిప్రాయపడింది. గ్యాస్ లీక్ అయిన ఎమ్‌-6 స్టైరీన్‌ ట్యాంక్‌ పైపింగ్‌ను ఎవరికీ చెప్పకుండా గత ఏడాది డిసెంబరులో ఆ సంస్థ మార్చేయటంతో సర్క్యులేషన్‌, మిక్సింగ్‌ వ్యవస్థలు దెబ్బతిన్నాయని.. ఈ దుర్ఘటనకు అప్పుడే బీజం పడిందని కూడా కమిటీ తేల్చింది.

సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ప్రకారం రాత్రి 2.45 సమయంలో ట్యాంకు నుంచి సైరీన్‌ ఆవిర్లు వెలువడగా.. ఉదయం 5.15 వరకూ కంపెనీ వాటి నియంత్రణకు చర్యలు చేపట్టలేదు. ఆ తర్వాత నీళ్లు చల్లారు. అయితే ఆవిరి రూపంలోకి మారిన స్టైరీన్‌ను తటస్థీకరించేందుకు అవసరమైన రసాయనాల నిల్వలు లేవు. అవి ఉంటే మధ్యాహ్నానికల్లా ఆవిర్లు నియంత్రించేందుకు అవకాశం ఉండేది. రాత్రి 10 గంటల సమయంలో రెండోసారి ఆవిర్లు వచ్చేవి కాదు. మొత్తంగా చూస్తే ఈ విషాదంలో ఎల్జీ పాలిమర్స్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఆ సంస్థపై మెతకగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు ఎదుర్కొంటున్న జగన్ సర్కారు.. కమిటీ నివేదికను అనుసరించి ఎలాంటి చర్యలు చేపడుతుందో.. బాధితులకు ఎలా న్యాయం చేస్తుందో చూడాలి.

 

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort
Best10 tipobet