తప్పు ఎవరిది..? ఈ రోడ్డు ప్రమాదం వీడియో చూశాక మీ అభిప్రాయం మారిపోతుంది
By సుభాష్ Published on 30 Aug 2020 5:54 PM ISTమనం ప్రతి నిత్యం ఎన్నో రోడ్డు ప్రమాదాలు చూస్తుంటాం. జరిగిన రోడ్డు ప్రమాదాల దృశ్యాలు సోషల్ మీడియాలో సీసీ పుటేజీ వీడియోలు చూస్తూ ఏదో ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటాము. 'వీళ్లు మారరు.. ప్రమాదాలు జరుగకుండా పోలీసులు ఎన్ని చర్యల చేపట్టినా.. ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి.. వేగంగా వాహనాలు నడపడం, అజాగ్రత్తల వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.. ఇష్టం వచ్చినట్లు వాహనాలు నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.. అంటూ కామెంట్స్ చేస్తుంటారు.
ఇదీ చదవండి: బంజారాహిల్స్: సంచిలో వృద్ధురాలి మృతదేహం
అయితే ఒక వీడియోను పూర్తిగా చూడకుండా కొన్ని సెకన్ల పాటు చూసి ఓ అభిప్రాయం వ్యక్తం చేయకూడదనేది ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో కూడా అలాంటిదే. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అడిషనల్ సీపీ అనిల్‌కుమార్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియో మొదటి 10 సెకన్ల పాటు చూసిన తర్వాత మీరు ఓ అభిప్రాయానికి వచ్చి ఉంటారు. రాంగ్ సైడ్‌లో డ్రైవింగ్ చేసుకుంటూ బైక్ మీద వచ్చిన జంట వల్లే ప్రమాదం జరిగిందని అనుకుంటారు. కానీ పూర్తి వీడియో చూసిన తర్వాత ప్రమాదానికి అసలు కారణం తెలుస్తుంది. కాబట్టి సీసీటీవీ కెమెరాలు ఉండటం కారణంగా ఇలాంటి కొన్ని తెరవెనుక జరిగిన ప్రమాదాల గురించి తెలుస్తుంటాయి.
ఇదీ చదవండి: చిత్తూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
మీరు కూడా మీమీ ప్రాంతాల్లో ఇలాగే సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు కోరుతున్నారు. సీసీటీవీ కెమెరాలు లేకపోతే జరిగిన ప్రమాదానికి గల అసలైన కారణాలు తెలియవు. అందుకే బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి.. అంటూ పోలీసులు కోరుతున్నారు.
అలాగే ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటూ ఎవరి తప్పో అనేది తెలిసిపోతుంది. కెమెరాలు లేకపోతే ఆధారాలు తెలుసుకునేందుకు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని వీడియోలు కొన్ని సెకన్ల పాటు వీడియో చూస్తే అసలు కారణాలు తెలియవు. మొత్తం వీడియో చూస్తేనే ప్రమాదానికి గల అసలైన కారణాలు తెలుస్తుంటాయి.
మరీ ఈ ప్రమాదం చూశాక తప్పు ఎవరిది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంటుంది. కారు కానీ..బైక్ మీద వచ్చేవాళ్లు కానీ.. సరైన రూట్లో వచ్చారు. బైక్ మీద వచ్చే జంటకు కుక్కు ఎదురు రావడంతో తప్పించుకునేందుకు ప్రయత్నించగా, ఎదురుగా వస్తున్న కారుకు బైక్ అడ్డం తిరగడంతో ఈ ప్రమాదం జరిగింది.