చిత్తూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

By సుభాష్  Published on  30 Aug 2020 6:01 AM GMT
చిత్తూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పలమనేరు మండలం బలిజపల్లి సమీపంలో ఓ కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, కారు వేగంగా వెళ్తుండటంతో అదుపు తప్పి లారీ కిందకు దూసుకెళ్లింది. అలాగే మరో ద్విచక్ర వాహనాన్ని కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు, మరో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందారు.

కారు బెంగళూరు నుంచి చిత్తూరుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారులో ఉన్నవారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని సమాచారం. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు శ్రీనివాస్‌, వెంకటేష్‌, రత్నమ్మ, మరొకరు చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Road Acciden 1

Next Story
Share it