యాంకర్‌కు ఓపెన్ ఆఫర్ ఇచ్చేసిన వర్మ.. ఓకే అంటే సినిమా.. ‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Jun 2020 12:01 PM IST
యాంకర్‌కు ఓపెన్ ఆఫర్ ఇచ్చేసిన వర్మ.. ఓకే అంటే సినిమా.. ‌

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలవటమే కాదు.. ఊహించని రీతిలో వ్యాఖ్యలు చేసే అలవాటు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఎక్కువే. ఎవరిని ఉద్దేశించి ఎప్పుడేమంటారో ఆయనకు మాత్రమే తెలుస్తుంది. రోటీన్ కు భిన్నంగా వ్యవహరించే ఆయన.. లాక్ డౌన్ లో అందరూ సోషల్ మీడియాలో తమ ఫాలోయర్లతో ఎంగేజ్ అయిన వేళ.. ఆయన మాత్రం ఎడాపెడా సినిమాలు తీసేయటం..ఒకటి తర్వాత ఒకటి చొప్పున ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద విడుదల చేయటం తెలిసిందే. రీసెంట్ గా నగ్నం (నేక్డ్) పేరుతో బుల్లి సినిమాను విడుదల చేశారు. రూ.200 టికెట్ పెట్టి 30వేలకు పైగా టికెట్లను అమ్మి రికార్డు క్రియేట్ చేసినట్లు వర్మ స్వయంగా చెప్పుకుంటున్నారు.

తెలుగు సినిమాను మరో మలుపు తిప్పే ఈ విధానం రానున్న రోజుల్లో మరిన్ని కొత్త మార్గాలకు తెర తీస్తుందన్న మాట ఆయన చెబుతున్నదే. ఈ మధ్యన కొన్ని చానళ్లకు.. వెబ్ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారయ. ఈ సందర్భంగా ఒక వెబ్ చానల్ ఇంటర్వ్యూకు వెళ్లిన ఆయన.. ప్రశ్నలు వేసే యాంకరమ్మకు.. తనదైన రీతిలో ప్రశ్న వేసి ఉక్కిరిబిక్కిరి చేశారు.

ఇటీవల కాలంలో తానింత అందమైన యాంకర్ ను చూడలేదన్న ఆయన.. ‘‘మీరు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. మీరు ఓకే అంటే వెంటనే సినిమా చేస్తా’’ అంటూ ఆఫర్ ఇచ్చేశారు. తాను ఆన్ కెమేరా ముందు హామీ ఇస్తున్న విషయాన్ని పేర్కొన్నారు. ఎందుకు మీరు చిన్న స్క్రీన్ (ఇక్కడ) ఉన్నారంటూ పొగిడేసిన వర్మ.. ఈ మద్య కాలంలో నేను చూసిన అత్యంత అందమైన యాంకర్ మీరేనంటూ ఇంటర్వ్యూలో ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేశారు.

వర్మ మాటలతో సదరు యాంకర్(చందన) ఆనందపడిపోయారు. తాను అడగాల్సిన ప్రశ్నల విషయంలో కాస్తంత తడబడినా.. ఆ వెంటనే సర్దుకోవటం కనిపిస్తుంది. అందంతో పాటు ఛార్మింగ్ కూడా ఉందని.. సినిమాల్లో నటించే ఆలోచన ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు. యాంకర్ కు ఓపెన్ ఆఫర్ ఇచ్చేసిన వర్మకు.. సదరు యాంకర్ చందన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కాలమే చెప్పాలి. ఈ ఇంటర్వ్యూలో 29 నిమిషం నుంచి యాంకర్ కు షాకిచ్చే మాటలు మొదలవుతాయి.

Next Story