రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడు ఏ సినిమాను పూర్తీ చేస్తాడో, ఎవరికీ తెలీదు. ఎప్పుడు ఏ సినిమాను తెరకెక్కిస్తాడో కూడా అంచనాలకు అందని విషయమే..! ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా రామ్ గోపాల్ వర్మ తెలుగు రాష్ట్రాల ప్రజలకు షాక్ ఇచ్చేలా ఓ అనౌన్స్మెంట్ ఇచ్చాడు.

ప్రణయ్ హత్యోదంతం గురించి తెలిసి తెలుగు రాష్ట్రాల ప్రజలు నిర్ఘాంతపోయిన సంగతి తెలిసిందే. తన కుమార్తె అమృతను పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో ప్రణయ్ ను బహిరంగంగా చంపించడం.. ఆ ఘటనలో మారుతీరావును ప్రధాన నిందితుడిగా జైలుకు పంపించడం.. జైలు నుండి వచ్చిన కొద్దిరోజులకు మారుతీరావు ఆత్మహత్య చేసుకుని చనిపోవడం సంచలనం అయ్యాయి. ఇప్పుడు ఈ ఘటనపై రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తున్నానంటూ సంచలన ప్రకటన చేశాడు. ఫాదర్స్ డే రోజున సాయంత్రం 5 గంటలకు ఈ ట్రాజిక్ స్టోరీకి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేస్తానని తెలిపాడు.



కూతురు అమృత వేరే కులం యువకుడైన ప్రణయ్‌ని ప్రేమ పెళ్లి చేసుకుందని.. ఆ యువకుడిని కొంతమందితో కలిసి చంపించిన మారుతీరావు హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో అర్థరాత్రి విషం తాగి ఆత్మహత్య చేసుకోవడం వరకూ మాత్రమే తన సినిమాలో చూపిస్తాడో.. లేక ప్రజలకు మీడియాకు తెలియని విషయాలను కూడా వర్మ కనుక్కున్నాడా.. లేక ఈ ఘటనలను ఏ కోణంలో చూపిస్తాడో వర్మకే తెలియాలి.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story