హార్దిక్ పాండ్యా వర్క్అవుట్‌ చూసి షాక్ తిన్న బాలీవుడ్ బ్యూటీలు.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Jun 2020 11:06 AM GMT
హార్దిక్ పాండ్యా వర్క్అవుట్‌ చూసి షాక్ తిన్న బాలీవుడ్ బ్యూటీలు.!

ఇప్పటి భారత క్రికెట్ జట్టు సభ్యులు ఫిట్‌నెస్‌ కు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. కెప్టెన్ కోహ్లీ ఫిట్‌నెస్ ను ఒక రేంజిలో మెయింటైన్ చేస్తూ ఉంటారు. కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, బుమ్రాలు కూడా ఫిట్‌నెస్ విషయంలో అత్యంత శ్రద్ధ కనబరుస్తూ ఉంటారు. వీరందరూ సామాజిక మాధ్యమాల్లో తమ వర్క్అవుట్ వీడియోలను పోస్టు చేస్తూ ఉంటారు.

తాజాగా హార్దిక్ పాండ్యా తన వర్క్అవుట్ వీడియోను తన ఫాలోవర్స్ తో షేర్ చేసుకున్నాడు. ఈ వీడియోలో హాప్ పుషప్స్ ను ఎంతో ఈజీగా చేస్తూ ఉన్నాడు హార్దిక్ పాండ్యా. ఒక పుషప్ చేసి.. ఒక సారి హాప్ జంప్.. ఇలా ఎంతో అవలీలగా చేయడాన్ని చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. హార్దిక్ పాండ్యా ఈ వీడియోను అప్లోడ్ చేసి తన అన్న కృనాల్ పాండ్యాకు ఛాలెంజ్ విసిరాడు. నువ్వు ఎన్ని చేయగలవో నేను చూస్తూ అంటూ ఛాలెంజ్ విసిరాడు.

హార్దిక్ పాండ్యా వీడియోపై అభిమానులే కాకుండా బాలీవుడ్ బ్యూటీలు కూడా స్పందించారు. హార్దిక్ పాండ్యా పార్ట్నర్ నటాషా బైసెప్స్ ఈమోజీ పెట్టగా.. నటి సయామీ ఖేర్ 'ఇన్ సేన్' అంటూ స్పందించింది. మరో బాలీవుడ్ బ్యూటీ కరిష్మా తన్నా 'ఇంత అద్భుతంగా ఎలా చేయగలుగుతున్నావ్.. వావ్' అని కామెంట్లు పెట్టింది.

N1

గత నెలలో హార్దిక్ పాండ్యా తాను తండ్రి కాబోతున్నాను అంటూ ప్రకటించి అందరినీ షాక్ కు గురిచేశాడు. నటాషా బేబీ బంప్ తో ఉన్న ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశాడు హార్దిక్. నటాషాతో తన జర్నీ మరింత గొప్పగా ఉండబోతోందని.. బిడ్డ రాక గురించి తెలియజేశాడు హార్దిక్.

Next Story