ఆర్జీవీ మ‌రో సంచ‌ల‌నం 'ప‌వ‌ర్ స్టార్'‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Jun 2020 9:00 AM GMT
ఆర్జీవీ మ‌రో సంచ‌ల‌నం ప‌వ‌ర్ స్టార్‌

వివాదస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్‌ వర్మ మరో సంచలనానికి తెర‌లేపారు. రెండు వారాల క్రితం తెలుగు రాష్ట్రాల‌లో సంచ‌ల‌నం సృష్టించిన ప్ర‌ణయ్, అమృత, మారుతీ రావు జీవిత విశేషాల‌కు సంబంధించి 'మ‌ర్డ‌ర్' అనే సినిమా ప‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేసి వార్త‌ల్లో నిలిచిన‌ ఆర్జీవీ.. నేడు మ‌రో సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.‌ఆర్జీవీ తాజాగా.. పవర్‌ స్టార్‌ సినిమా చేయనున్నట్లు ట్విట‌ర్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ‘‘ బ్రేకింగ్‌ న్యూస్‌: ఆర్జీవీ వరల్డ్‌ థియోటర్‌ కొత్త సినిమాకు ‘పవర్‌ స్టార్‌’ అని పేరు పెట్టాం. పీకే, ఎమ్‌ఎస్‌, ఎన్‌బీ, టీఎస్‌, ఓ రష్యన్‌ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీతో సినిమా తీయబోతున్నాం. ఈ సినిమాలోని పాత్రలు ఎవరో అర్థం చేసుకోవటానికి ఎటువంటి బహుమతులు ఇవ్వబడవు అని పేర్కొన్నారు.అలాగే మ‌రో ట్వీట్లో పవర్‌ స్టార్‌ పాత్రధారికి సంబంధించి ఓ వీడియోను విడుదల చేశారు. నా కొత్త సినిమా పవర్‌ స్టార్ హీరో ఇతనే. అతడు మా ఆఫీస్‌ వద్దకు వచ్చినపుడు ఈ వీడియోను చిత్రీకరించాం. ఏ వ్యక్తినైనా పోలిన వ్యక్తులు ఉండటం యాధృచ్చికం కాని యాధృచ్చికం.. ఉద్ధేశ్యపూర్వకం కాని ఉద్ధేశ్యపూర్వకం అంటూ తనలాగే అర్థం కానీ ఓ కొటేష‌న్‌ను కూడా అందుకు జ‌త‌చేశాడు ఆర్జీవీ.

Next Story