పక్క రాష్ట్రంలో గెల‌వ‌ని వారితో రాజకీయాలు ఎంటో..

Balka Suman Fires On BJP. శ‌నివారం నుంచి టీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం

By Medi Samrat  Published on  21 Nov 2020 7:00 AM GMT
పక్క రాష్ట్రంలో గెల‌వ‌ని వారితో రాజకీయాలు ఎంటో..

శ‌నివారం నుంచి టీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ప్రారంభ‌మ‌వుతుంద‌ని ఆ పార్టీ నేత‌, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తెల‌పారు. తెలంగాణ భవన్‌లో పాత్రికేయుల‌తో మాట్లాడిన ఆయ‌న ప్ర‌తిప‌క్షాల‌పై విమ‌ర్శ‌లు చేశారు.

టీఆర్ఎస్ పార్టీ ప్రశాంతంగా ఉంటే.. ప్రతిపక్ష పార్టీల్లో సొంతపార్టీ నేతల విమర్శలతో గందరగోళం నెల‌కొంద‌ని ఆయ‌న అన్నారు. టీఆర్ఎస్ ప్రకటించిన టికెట్లలో 50శాతంకి పైగా డిగ్రీ పూర్తి చేసిన వారున్నార‌ని.. ప్రతిపక్షాల మాటలు ప్రజలకు కామెడీ షో లా అనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట గెలువలేదని.. పక్క రాష్ట్రంలో దేనికి పనికి రాని వ్యక్తితో హైదరాబాద్ లో రాజకీయాలు ఎంటో వాళ్ళకే తెలియాలని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. అన్ని పథకాలు మావే అన్న కేంద్రం.. 30 ఏళ్ల‌ లోపు కేంద్ర ఉద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల‌ని డిమాండ్ చేశారు.

బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడు.. ఆ హోదా లో హుందాగా ఉండాలని హితువు ప‌లికారు. పార్టీ ఆఫీస్ లలో జర్నలిస్టులను కొట్టిన దుస్థితి ప్రతిపక్షాలు తెచ్చాయని.. బీజేపీ పాలిత రాష్ట్రాలైన‌ ఉత్తర్ ప్రదేశ్ - గుజరాజ్ లో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని.. ప్రతిపక్షాలు టీఆర్ఎస్ నేతలపై వ్యక్తిగత విమర్శలు మానుకొని దమ్ముంటే అభివృద్ధిపై మాట్లాడాలని స‌వాల్ విసిరారు.


Next Story