రేపు ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
By సుభాష్ Published on 10 May 2020 4:29 PM ISTదేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనాను కట్టడి చేసేందుకు అన్ని జిల్లాల్లో లాక్‌డౌన్ కొనసాగుతోంది. అయితే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో దేశ ప్రధాని నరేంద్రమోదీ మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 3గంటలకు సీఎంలో ఈ కాన్ఫరెన్స్ ఉండనుంది. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యశాఖ మంత్రి, వైద్యశాఖ కార్యదర్శి, హోంమంత్రి , హోంశాఖ కార్యదర్శి కూడా హాజరు కావాలని కేంద్రం సూచించింది. లాక్‌డౌన్ 3.0 తర్వాత మళ్లీ లాక్‌డౌన్ కొనసాగించాలా.. వద్దా.? అనే అంశంపై చర్చించనున్నారు. అలాగే కరోనాతో రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సవాళ్లు, రాష్ట్రాల వారిగా కరోనా వైరస్, లాక్‌డౌన్ పనితీరు తదితర అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యమంత్రులతో మోదీ సమావేశం కావడం ఇది ఐదోసారి.
కాగా, దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతీరోజు దేశంలో దాదాపు మూడువేల వరకూ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఏపీలో కూడా తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండగా, తెలంగాణలో కాస్త తగ్గుముఖం పట్టింది. 14 రోజులకు పైగా తెలంగాణలోని ఏ రాష్ట్రాల్లో కూడా ఒక్క కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం లేదు. ఒక్క హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో మాత్రమే నమోదువుతున్నాయి.