న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

By సుభాష్  Published on  9 Oct 2020 10:05 AM GMT
న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

1.ఎమ్మెల్యే ప్రేమ పెళ్లిపై మద్రాస్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

తమిళనాడు అన్నాడీఎంకే ఎమ్మెల్యే ప్రభు ప్రేమ పెళ్లిపై మద్రాస్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యే ప్రేమ పెళ్లి చెల్లుతుందని కోర్టు అభిప్రాయపడింది. సౌందర్య మేజర్ కాబట్టి ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోలేమని తేల్చి చెప్పింది. సౌందర్య అనుమతితోనే వివాహం జరిగింది.. ఇప్పుడు న్యాయస్థానం ఎలాంటి చర్యలు తీసుకోవాడనికి అవకాశం లేదని హైకోర్టు తెలిపింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2.రాజస్థాన్‌లో దారుణం.. ఆలయ పూజారికి నిప్పంటించిన దుండగులు

రాజస్థాన్‌లోని కరౌలి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భూ వివాదంలో ఆలయ పూజారిని కొందరు నిప్పటించించడంతో మరణించాడు. కరౌలి జిల్లాలోని సపోత్రా ప్రాంతంలో రాధాకృష్ణ ఆలయంలో పూజాధికారాలు నిర్వహించేందుకు పూజారికి 5.2 ఎకరాలు అప్పగించారు. అయితే ఈ భూమి కరౌలీలో వివాదానికి దారితీసింది. గ్రామ పూజారి బాబాలాల్‌ వైష్ణవ్‌.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3.అలా చేయాల‌నుకున్న‌ప్పుడు లక్ష్మీదేవిని పూజిస్తాను

త‌మ‌కు భార‌తీయ సంప్ర‌దాయాలంటే గౌర‌వ‌మ‌ని‌, హిందూ దేవుళ్ల‌ను ఆరాధిస్తామ‌ని గ‌తంలో చాలామంది విదేశీయులు, ఇతర మతస్థులు చెప్పిన సంద‌ర్భాలున్నాయి. అలాంటి వాళ్లలో పలు రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఉన్నారు. తాజాగా.. ఎన్నో హాలీవుడ్ సూపర్‌హిట్ చిత్రాల్లో నటించి కథానాయికగా మంచి గుర్తింపు పొందిన సల్మా హయెక్ కూడా హిందూ దేవ‌త‌ను పూజిస్తుందట.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4.కస్టమర్లకు ఆర్‌బీఐ శుభవార్త.. ఇక 24×7 ఆర్టీజీఎస్‌ సేవలు

భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ) కస్టమర్లకు శుభవార్త ప్రకటించింది. ఇకపై నగదు బదిలీకి సంబంధించిన ఆర్టీజీఎస్‌ (రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌) సేవల్ని 24 గంటలు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఇది డిసెంబరు నుంచి అమల్లోకి రానున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఈ సేవలు బ్యాంకుల పనిదినాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉండగా.. డిసెంబర్‌ నుంచి 24×7 అందుబాటులోకి రానున్నాయి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5.Fact Check : ‘ఠాకూర్లు కూడా అప్పుడప్పుడు తప్పులు చేస్తూ ఉంటారు’ అని యోగి ఆదిత్యనాథ్ అన్నారా..?

హిందీ న్యూస్ ఛానల్ ‘ఆజ్ తక్’ న్యూస్ బులిటెన్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందులో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ‘ఠాకూర్ల రక్తం మరుగుతూ ఉంటుంది.. వాళ్ళు కూడా తప్పులు చేస్తూ ఉంటారు’ అనే వ్యాఖ్యలు చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ చేస్తూ ఉన్నారు. హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనపై యోగి ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తూ ఉన్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6.కేంద్ర మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ కన్నుమూత

కేంద్ర మంత్రి, ప్రముఖ దళిత నేత రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ (74) గురువారం రాత్రి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆయన గుండె శాస్త్ర చికిత్స జరిగింది. పాశ్వాన్‌ మరణ వార్తను ఆయన కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్‌ ట్వీట్‌ చేశారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7.ఆ మహిళ వస్తే మరిన్ని అక్రమాలు బట్టబయలు..!

అక్రమాస్తుల కేసులు ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డి వ్యవహారంలో విచారణ ముమ్మరంగా చేశారు ఏసీబీ అధికారులు. నరసింహారెడ్డి నాలుగు రోజుల కస్టడీలో భాగంగా ఏసీబీ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది. ఏది అడిగిన నోరు విప్పని నర్సింహారెడ్డిని మరింత లోతుగా విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8.హైదరాబాద్‌తో మ్యాచ్‌లో గేల్‌ ఎందుకు ఆడలేకపోయాడంటే..?

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు విధ్వంసకర వీరుడు క్రిస్‌గేల్‌ను వరుసగా ఆరో మ్యాచ్‌లోనూ పక్కన పెట్టింది. నిన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రిస్‌గేల్‌ ఆడాల్సి ఉందని.. అయితే ఆఖరి నిమిషంలో అతడు మ్యాచ్‌కు దూరం అయ్యాడని పంజాబ్‌ కోచ్‌ అనిల్‌ కుంబ్లే అన్నాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్) 13వ సీజన్‌ మొదలై.. దాదాపు సగం సీజన్‌ ముగుస్తున్నా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9.ప్రభాస్‌ సినిమా అప్‌డేట్‌.. బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చిన వైజయంతీ మూవీస్

‘బాహుబలి’ చిత్రం తరువాత యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ రేంజ్‌ మారిపోయింది. ఆయన సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని కోట్లాది మంది సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్‌ చిత్రం తెరకెక్కనుంది. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై అశ్విన్‌దత్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన బాలీవుడ్‌ భామ దీపికా పదుకొనే నటిస్తోంది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10.తోక లేని పిట్ట గూడుకు కొత్త అందాలు.. నేడు ప్రపంచ తపాలా దినోత్సవం

తోక లేని పిట్ట తొంబై ఆరు ఊర్లు తిరిగింది అని ఉత్తరాన్ని గురించి మన పెద్దలు చెప్పేవారు. అలాంటి ఉత్తరాల పోస్టల్ శాఖ మన జీవితంలో భాగమై సరి కొత్త అందాల తో మెరిసి పోతోంది. ఉత్తరం మనలోని అనేక భావాలకు చిహ్నం. మారు మూల ప్రాంతాలకు పోస్టల్ శాఖ తన సేవలను 1854లో ప్రారంభించింది. భారత దేశంలో రైల్వే శాఖ తరువాత రెండవ అతిపెద్ద వ్యవస్థ పోస్టల్ శాఖ. సెల్ ఫోన్ వచ్చిన తరువాత ఉత్తరాలు రాసే వారు తగ్గినా, కాలానికి తగ్గట్టుగా మార్పులు చేసుకుంటూ సరి కొత్త అందాలతో.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Next Story