ఎమ్మెల్యే ప్రేమ పెళ్లిపై మద్రాస్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

By సుభాష్  Published on  9 Oct 2020 9:49 AM GMT
ఎమ్మెల్యే ప్రేమ పెళ్లిపై మద్రాస్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

తమిళనాడు అన్నాడీఎంకే ఎమ్మెల్యే ప్రభు ప్రేమ పెళ్లిపై మద్రాస్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యే ప్రేమ పెళ్లి చెల్లుతుందని కోర్టు అభిప్రాయపడింది. సౌందర్య మేజర్ కాబట్టి ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోలేమని తేల్చి చెప్పింది. సౌందర్య అనుమతితోనే వివాహం జరిగింది.. ఇప్పుడు న్యాయస్థానం ఎలాంటి చర్యలు తీసుకోవాడనికి అవకాశం లేదని హైకోర్టు తెలిపింది.

కాగా, అమ్మాయి తండ్రి అయిన స్వామినాథన్‌ వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. కుమార్తె సౌందర్యతో మాట్లాడేందుకు తండ్రి స్వామినాథన్‌కు కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే తండ్రి మాటలను సౌందర్య పట్టించుకోనట్లు తెలుస్తోంది. కాగా, గత వారం ఎమ్మెల్యే ప్రభు ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీనిపై సౌందర్య తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. తన కుమార్తెను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని, ఇంకా తన కుమార్తెకు 19 ఏళ్లు కూడా నిండలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై శుక్రవారం సౌందర్యను పిలిపించి స్వామినాథన్‌ వేసిన పిటిషన్‌పై కోర్టు విచారించి ఈ మేరకు తీర్పునిచ్చింది.

Next Story