అలా చేయాల‌నుకున్న‌ప్పుడు లక్ష్మీదేవిని పూజిస్తాను

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Oct 2020 9:20 AM GMT
అలా చేయాల‌నుకున్న‌ప్పుడు లక్ష్మీదేవిని పూజిస్తాను

త‌మ‌కు భార‌తీయ సంప్ర‌దాయాలంటే గౌర‌వ‌మ‌ని‌, హిందూ దేవుళ్ల‌ను ఆరాధిస్తామ‌ని గ‌తంలో చాలామంది విదేశీయులు, ఇతర మతస్థులు చెప్పిన సంద‌ర్భాలున్నాయి. అలాంటి వాళ్లలో పలు రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఉన్నారు. తాజాగా.. ఎన్నో హాలీవుడ్ సూపర్‌హిట్ చిత్రాల్లో నటించి కథానాయికగా మంచి గుర్తింపు పొందిన సల్మా హయెక్ కూడా హిందూ దేవ‌త‌ను పూజిస్తుందట.

వివ‌రాళ్లోకెళితే.. సల్మా హయెక్ ధ్యానంలో కూర్చున్నప్పుడు.. లక్ష్మీదేవిపైనే దృష్టి పెడుతుందట. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ ద్వారా వెల్లడించింది. లక్ష్మీదేవి ఫొటోను కూడా పోస్టుకు జ‌త‌చేసింది.

View this post on Instagram

When I want to connect with my inner beauty, I start my meditation focusing on the goddess Lakshmi, who in Hinduism represents wealth, fortune, love, beauty, Māyā (literally meaning "illusion" or "magic”), joy and prosperity. Somehow her image makes me feel joyful, and joy is the greatest door for your inner beauty. Cuando quiero conectarme con mi belleza interior, comienzo mi meditación enfocándome en la diosa Lakshmi, quien en el hinduismo representa la riqueza, la fortuna, el amor, la belleza, Māyā (que literalmente significa "ilusión" o "magia"), alegría y prosperidad. De alguna manera su imagen me trae alegria, y piensa que la alegría es la puerta más directa para tu belleza interior. #innerbeauty #hinduism #lakshmi #meditation

A post shared by Salma Hayek Pinault (@salmahayek) on

నేను నా అంత:సౌందర్యంతో అనుసంధానం కావాలనుకున్నప్పుడు లక్ష్మీదేవిపై దృష్టి పెట్టి ధ్యానం చేస్తాను. హిందూ మతస్థులు ఆమెను సంపదకు, అదృష్టానికి, ప్రేమకు, అందానికి ప్రతీక‌గా కొలుస్తారు. ఆమె రూపం నాకు చాలా సంతోషాన్ని, ప్రశాంతతను కలిగిస్తుంది. సంతోషం, ప్రశాంతత మన అంత:సౌందర్యానికి బాటలు వేస్తాయని త‌న పోస్టులో పేర్కొంది. సల్మా హయెక్ పోస్ట్ చూసిన బాలీవుడ్ హీరోయిన్ బిపాసా బసు 'అమేజింగ్‌' అంటూ కామెంట్ చేసింది.

Next Story