అత్య‌ధిక పారితోషికం తీసుకునే న‌టి ఈమే.. సంపాద‌న తెలిస్తే అవాక్కే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Oct 2020 9:49 AM GMT
అత్య‌ధిక పారితోషికం తీసుకునే న‌టి ఈమే.. సంపాద‌న తెలిస్తే అవాక్కే..!

ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటి ఎవ‌రో తెలుసా..? ఆ న‌టి పేరు సోఫియా వెర్గారా. ఫోర్బ్స్ తాజాగా విడుద‌ల చేసిన నివేదికలో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. అమెరికా టీవీ షో 'ది మోడ్రన్ ఫ్యామిలీ' కార్యక్రమంతో బాగా పాపుల‌ర్ అయిన ఈ న‌టి ఏడాది కాలంలో ఏకంగా 43 మిలియన్ డాలర్లు (రూ.315 కోట్లు) ఆర్జించిందట.

సోఫియా వెర్గారా.. ప్రముఖ నటి ఏంజెలినా జోలీ 35.5 మిలియన్ డాలర్లు(260 కోట్లు)ని కూడా దాటేసింది. సోఫియా, ఏంజెలీనా తర్వాతి స్థానాల్లో గాల్ గాడోట్ 31 మిలియన్ డాలర్స్(227 కోట్లు), మెలిస్సా మెక్‌కార్తీ 25 మిలియన్ డాలర్స్(183 కోట్లు), మెరిల్ స్ట్రీప్ 24 మిలియన్ డాలర్స్(175 కోట్లు) తదితరులు ఉన్నారు. పలు బ్రాండ్ల‌కు అంబాసిడ‌ర్‌గా వ్యవహరిస్తున్న సోఫియాకు ఇన్‌స్టాగ్రామ్ లో 20.2 మిలియన్ల మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు.

Next Story