బాలీవుడ్‌లో విషాదం.. మిస్తీ ముఖర్జీ కన్నుమూత

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Oct 2020 7:07 AM GMT
బాలీవుడ్‌లో విషాదం.. మిస్తీ ముఖర్జీ కన్నుమూత

బాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఐటెం సాంగ్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న మిష్టీ ముఖర్జీ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతోంది. ఈ క్రమంలో బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు. ఆమె వయసు 27 సంవత్సరాలు. ఆమె మృతి పట్ల బాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

2012లో 'లైఫ్ కి తో ల‌గ్ గ‌యి' అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. రజనీష్‌ దుగ్గత్‌తో కలిసి గోవింద ఆలే రే అనే డ్యాన్స్‌ నెంబర్‌ చేసింది. ఈ చిత్రంలో హృతిక్‌ రోషన్‌, కత్రినా కైఫ్ స్పెషల్ అప్పియరెన్స్‌ ఇవ్వగా.. జూహ్లి చావ్లా ప్రధాన పాత్రలో నటించారు. పలు మ్యూజిక్‌ వీడియోలతో మరింత పాపులర్‌ అయ్యారు.

అయితే.. ముంబైలోని ఆమె అద్దె అపార్ట్‌మెంట్‌లో సెక్స్‌ రాకెట్‌ నడిపారనే ఆరోపణలు రావడంతో 2014లో నటి సోదరుడు, తండ్రిని అరెస్ట్‌ చేశారు. మిష్టీ ముఖర్జీ హిందీతో పాటు బెంగాలీ సినిమాలలో కూడా నటించారు.

Next Story